మాగుంట కీలక ప్రకటన - ఒంగోలు ఎంపీ అభ్యర్ధిపై క్లారిటీ : ఈడీ దాడులపైన వివరణ..!!

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేసారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా జరిగిన ఈడీ దాడుల పైన ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి స్పష్టత ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని మాగుంట వివరించారు. తమ ఇంటికి వచ్చి ఈడీ సోదాలు చేసిందని శ్రీనివాసులు రెడ్డి అంగీకరించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తన తో పాటుగా తన కుమారుడు పేరు ప్రచారంలోకి వచ్చిందని..తన వ్యక్తిత్వం పైన దాడి జరిగిందన్నారు.

లిక్కర్ వ్యాపారంలో దశాబ్దాలుగా

లిక్కర్ వ్యాపారంలో దశాబ్దాలుగా

ఢిల్లీ లిక్కర్ స్కాం పైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారని..సీబీఐ విచారణ కూడా జరుగుతుందన్నారు. 50 ఏళ్లుగా తమ కుటుంబం ఇదే వ్యాపారంలో ఉందని వివరించారు. తన రాజకీయ జీవితానికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని మాగుంట ప్రకటించారు. తనకు ముఖ్యమంత్రి..పార్టీలో అందరూ అన్ని వేళలా మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. తాను నాలుగు సార్లు ఎంపీగా.. ఒకసారి ఎమ్మెల్సీగా..బాధ్యతతో వ్యవహరించానన్నారు. మాగుంట కుటుంబం మచ్చ లేని కుటుంబమని..తమ ఇంటి పేరుతో ఉన్న బంధువుల నివాసాల్లో సోదాలు చేసినా..తన పేరే బయటకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఢి

వ్యక్తిత్వ హననం చేసేలా

వ్యక్తిత్వ హననం చేసేలా


ఢిల్లీ మీడియాలో తనను లిక్కర్ డాన్ అంటూ వ్యక్తిత్వం కించ పరిచేలా ప్రచారం చేసారని చెప్పుకొచ్చారు. తాను 35 సంవత్సరాలుగా 8 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నానని వివరించారు. మాగుంట ఇమేజ్ కు డామేజ్ జరిగిందన్నారు. రాజకీయాల్లో తాము ఎవరినీ ఎప్పుడూ విమర్శించలేదని..తమను ఎవరూ విమర్శించరని మాగుంట వివరించారు. ఢిల్లీలోని 32 జోన్లలో 2 జోన్లలో తమ బంధువులకు వ్యాపారం ఉందన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని.. ఎటువంటి ఇబ్బంది లేదని ఎంపీ మాగుంట క్లారిటీ ఇచ్చారు. తాము బీజేలోకి వెళ్తున్నారనే వాదనను ఆయన తోసి పుచ్చారు.

కుమారుడు రాఘవ పోటీ చేస్తారు

కుమారుడు రాఘవ పోటీ చేస్తారు

రాజకీయంగా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఈ స్కాంలో తమకు సంబంధం ఉన్నట్లుగా కొందరు కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తమ కుమారుడుకు ఢిల్లీలో ఎటువంటి వ్యాపారాలు లేవని..చెన్నైలోనే చూసుకుంటున్నారని చెప్పారు. తాము ఎప్పుడూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకూ తమ పనుల కోసం వెళ్లలేదని వివరించారు. తాను విచారణ సంస్థలను తప్పు బట్టటం లేదని..వారికి వచ్చిన ఆదేశాలను వారు అమలు చేస్తున్నారని ఎంపీ మాగుంట వ్యాఖ్యానించారు. సోదాల సమయంలో వారి సందేహలు అన్నింటికీ సమాధానం ఇచ్చామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+