ఆయన సీఎం అయ్యేది లేదు.. ఈయన హోం మంత్రి అయ్యేదీ లేదు!!
తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబునాయుడిలా అయ్యన్నపాత్రుడికి కూడా మతిభ్రమించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. అటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. ఇటు అయ్యన్నకు హోంమంత్రి పదవి వచ్చేది లేదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అవుతానంటూ కలలు కంటున్నారని, అయ్యన్న హోం మంత్రి అవుతారని కలలు కంటున్నారని, అవి సాకారం కావని, మరోసారి వైసీపీ అధికారంలోకి
ఎన్నికలు జరిగినట్లు.. వెంటనే తాను హోం మంత్రి అయినట్లు అయ్యన్నపాత్రుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. అయ్యన్న కలల ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి రావాలని, నాలుగు రోజుల తర్వాత ఏ పోలీసుల బట్టలైతే ఊడదీస్తామన్నారో.. వారే అయ్యన్నపాత్రుడి బట్టలు ఊడదీస్తారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతల తీరుతోనే గుంటూరులో అమాయకులు బలయ్యారని, వీరికి ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.

జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వం దోచుకుందని, అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడాలని, మూడున్నర సంవత్సరాల్లో ప్రజల కోసం ఎప్పుడైనా టీడీపీ నాయకులు మాట్లాడారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చినవాటిలో 98 శాతం అమలు చేశారన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరేదీ లేదని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలు కళ్లుతెరవాలన్నారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications