వైసీపీకి జగన్ సన్నిహిత నేత గుడ్ బై - టీడీపీ తాజా ఆఫర్..!!
వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. జగన్ కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీ వీడేందుకు తన అనుచర వర్గంతో మంతనాలు చేస్తున్నారు. రేపు (గురువారం) పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి మోపిదేవి తాజా ఆఫర్ వచ్చింది. దీంతో..జగన్ తో తన అనుబంధాన్ని తెంచుకొనేందుకు మోపిదేవి సిద్దమయ్యారు.
మోపిదేవి నిర్ణయం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి పార్టీ వీడేందుకు నిర్ణయించారు. మోపిదేవి తొలి నుంచి వైఎస్సార్ కు విధేయుడుగా ఉన్నారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రిగా పని చేసారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ పైన నమోదైన సీబీఐ కేసుల్లో మోపిదేవి నిందితుడుగా ఉన్నారు. కొంత కాలం జైలు శిక్ష అనుభవించారు. జగన్ పార్టీలో చేరిన తరువాత కీలక బాధ్యతల్లో పని చేసారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఎంపీగా రాజీనామా
దీంతో, మోపిదేవిని ఎమ్మెల్సీని చేసిన జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తరువాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ను జగన్ రాజ్యసభ కు ఎంపిక చేసారు. ఎంపీలుగా ఎన్నికైన తరువాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇక, తాజా ఎన్నికల్లో మోపిదేవికి మరోసారి రేపల్లె నుంచి పోటీ చేసారు. వైసీపీ అధికారం కోల్పోవటంతో మోపిదేవిని పార్టీ మారాలంటూ అనుచరవర్గం నుంచి ఒత్తిడి మొదలైంది. అయితే, కొంత కాలంగా మోపిదేవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీలోకి ఎంట్రీ
జగన్ కు సన్నిహితంగా ఉంటున్న మోపిదేవితో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. టీడీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. మోపిదేవి కుమారుడుకు నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎమ్మెల్యే సీటు ఇస్తామనే హామీ దక్కింది. రాజ్యసభకు రాజీనామా చేసిన తరువాత మోపిదేవికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, మోపిదేవి వైసీపీ వీడటం దాదాపు ఖాయమైంది. రేపు కార్యకర్తల సమావేశంలో అధికారికంగా మోపిదేవి తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications