పదోతరగతి విద్యార్థి హత్య: ప్రభుత్వం అండగా ఉంటే టీడీపీ శవరాజకీయాలు దారుణం: ఎంపీ మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్ హత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన లో విద్యార్థి మృతి చెందగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పల వారి పాలెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన ప్రభుత్వం తక్షణ సాయంగా 10 లక్షల రూపాయలు అందించింది.

బాధిత కుటుంబానికి ఇంటి స్థలం తో పాటుగా ఇళ్లు కట్టించి ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వైసిపి ప్రభుత్వం పేర్కొంది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక దీనిపై రాజ్యసభ ఎంపీ రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గం పరిధిలోని ఉప్పల వారి పాలెం లో జరిగిన బాలుడి హత్య ఘటనపై సీఎం జగన్ స్పందించారన్నారు.

MP Mopidevi venkata ramana

తాము బాధితులను పరామర్శించి వచ్చిన నాలుగైదు గంటల వ్యవధిలోనే 10 లక్షల రూపాయల చెక్కును సీఎం జగన్ పంపటం ఆయన నిబద్ధతకు కారణమన్నారు. బాధలో ఉన్న ప్రజల పట్ల సీఎం జగన్ స్పందిస్తున్న తీరు అందరికీ అర్థం అవుతుందని పేర్కొన్నారు. అమర్నాథ్ అనే పదవ తరగతి బాలుడు హత్యకు గురికావడం తమను ఎంతో కలచివేసిందని, ఈ హత్యకు పాల్పడిన నిందితులు నలుగురని తేలిందని, పోలీసులు ఘటన జరిగిన 24 గంటల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారన్నారు.

మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారని త్వరలోనే పట్టుకుంటారన్నారు. పార్టీలు, కులాలతో సంబంధం లేకుండా మానవత్వంతో తాను తన వంతుగా లక్ష రూపాయలు సహాయం చేసినట్లు పేర్కొన్నారు.చంద్రబాబు, టిడిపి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. బాధిత కుటుంబం కుమారుని కోల్పోయి బాధల్లో ఉంటే, ఓదార్చాల్సింది పోయి వారిని రెచ్చగొట్టి రోడ్ల పైకి తీసుకు రావడం చంద్రబాబు, టిడిపి నీచ రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

నిందితులను గంటల్లోనే పట్టుకున్నా ఎల్లో మీడియా లో నిందితులు పట్టుకోలేదని వార్తలు రాయడం దుర్మార్గమని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఈ ఘటనకు ఎటువంటి రాజకీయ, కుల నేపథ్యం లేదని ఆయన పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు డైరెక్షన్లో నీచ రాజకీయాలకు తెరతీశారు అని విమర్శించారు. కుల, శవ రాజకీయాలను చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు.

టిడిపి నేతలు చేతనైతే సహాయం చేయాలి కానీ రాజకీయాలు చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు కులాల మధ్య చిచ్చు పెట్టడం వెన్నతో పెట్టిన విద్య అని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో అల్లర్లు సృష్టించడం ఆయనకు అలవాటు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు తో పైకి వచ్చిన నాయకుడని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+