వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై హత్యకు కుట్ర.. సూత్రదారులు వారే.. రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్జండ్ వ్యక్తులతో హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి అన్ని వివరాలతో కూడిన లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు , కేసులు పెట్టేందుకే పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.

 జగనన్న గోరుముద్ద ఇక ఉండదు..

జగనన్న గోరుముద్ద ఇక ఉండదు..

ఏపీలో ఇకనుంచి జగనన్న గోరుముద్ద పథకం కొనసాగదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తాను రాసిన లేఖకు స్పందించారని తెలిపారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న జగనన్న పథకాలు కూడా కొనసాగించలేరని చెప్పారు. రాష్ట్రంలో మహిళా , స్త్రీ శిశు సంక్షేమశాఖ బాటలోనే ఇతర మంత్రిత్వ శాఖలు కూడా కొనసాగే అవకాశం లేదని విమర్శించారు.

 రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న

రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యవహారంలో స్పందించినంత వేగంగా స్పందించాల‌ని రఘురామకృష్ణం రాజు కోరారు. సునీల్ కుమార్‌కు మతం మాత్రమే తెలుసునని కులం తేలియ‌ద‌ని.. దాన్ని పలు సమయాల్లో ఆయన బహిర్గతం చేశారని విమర్శించారు. గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతను దారణంగా వైసీపీ నేతలు హత్య చేశారని మండిపడ్డారు. సీఎం జ‌గ‌న్‌కు వ్యవస్థలు నచ్చకపోతే వ్య‌వ‌స్థ‌ను తీసేసినట్లు.. వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను హత్య చేస్తున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న న‌డుస్తోంద‌న్నారు.

 చిరంజీవిని అల్లరి చేసేవిధంగా రాత‌లు..

చిరంజీవిని అల్లరి చేసేవిధంగా రాత‌లు..


సీఎం జగన్‌తో హీరో చిరంజీవి భేటీపై రఘరామకృష్ణం రాజు స్పందించారు. చిరంజీవిని అల్లరి చేసేవిధంగా ఆయన రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్తలు రాయించారని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చిరంజీవి చేయరని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. సీఎం జగన్ కు సినిమా రంగం కష్టాలు తెలియవా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రూ.3 సినిమా చూపిస్తా అంటే కుదరదన్నారు. అన్యాయం చేస్తే కోర్టులు కూడా ఉన్నాయన్న సంగతి జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు.

English summary
MP Raghurama Krishnam raju sensational comments on CM Jagan, YCP Leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X