జగన్ పార్టీ నేతల నుంచి ప్రాణహాని: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు

న్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

    BJP లో చేరాలని తహతహలాడుతున్న Raghu Rama Krishnam Raju | వైసీపీలో ధిక్కార స్వరం
    వైసీపీ నుంచి ప్రాణహాని

    వైసీపీ నుంచి ప్రాణహాని

    తనకు ప్రాణ హాని ఉందని.. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. శ్రీవారి ఆలయ భూముల అమ్మకం విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించానని,అప్పట్నుంచి తన నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

    వ్యక్తిగత దాడులకు దిగుతున్నారంటూ...

    వ్యక్తిగత దాడులకు దిగుతున్నారంటూ...

    కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశానని తెలిపారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి భక్తుడిగా తన లాంటివారు కోరుకున్న విషయాలను మీడియా ద్వారా చెప్పానని పేర్కొన్నారు. ఇలా బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని లేఖలో ప్రస్తావించారు.

    పోలీసులకు ఫిర్యాదు చేసినా..

    పోలీసులకు ఫిర్యాదు చేసినా..

    ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని, సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. అంతేగాక, నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారని వెల్లడించారు. స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పీకర్‌కు రాసిన లేఖలో వివరించారు.

    రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి..

    రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి..

    ఇది ఇలావుండగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ప్రాణహాని ఉందని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణవర్మ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గానికి వెళితే ఎంపీపైదాడి చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నాయకులపై విమర్శలు చేశారంటూ రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారని, తీవ్రంగా దూషిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో వైసీపీ నాయకుులు, కార్యకర్తలపై ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఎంపీకి రక్షణ కల్పించాలని కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+