సీఎం జగన్ తో గొడవ మొదలు అక్కడే- నా సభ్యత్వం రద్దు కాదు : ప్రధానికి అలా దగ్గరయ్యా-రఘురామ..!!

సీఎం జగన్ తో విభేదాలకు కారణం..ప్రధానితో ఉన్న సత్సంబంధాలతో పాటుగా అసలు వైసీపీలో ఎందుకు చేరిందీ ఎంపీ రఘురామ వివరించారు. అనేక ఆసక్తి కర అంశాలు బయట పెట్టారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పుకొచ్చారు. దేశంలో తొలి సారిగా ఒక ఎంపీ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ చెప్పుకొచ్చారు. తనను హింసిస్తూ..తన ఆర్తనాదాలు పైవాడికి చూపించారంటూ వ్యాఖ్యానించిన ఆయన ఆ పేరు మాత్రం బయట పెట్టలేదు.

జగన్ మారారని చెబితేనే పార్టీలోకి

జగన్ మారారని చెబితేనే పార్టీలోకి

2019 ఎన్నికల సమయంలో తనతో ప్రశాంత్ కిషోర్ పార్టీలోకి రావాలని కోరారని..పాదయాత్ర తరువాత జగన్ పూర్తిగా మారిపోయారని చెప్పటంతో తాను వచ్చానని చెప్పుకొచ్చారు. తనకు జగన్ తో గ్యాప్ రాలేదని..గ్యాప్ క్రియేట్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో తాను ఒక సందర్భంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350ఏ ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలని డిమాండ్ చేసానన్నారు. అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా ఈ అధికరణను అనుసరించేలా చూడాలని విద్యా శాఖ మంత్రిని కోరిన విషయాన్ని గుర్తు చేసారు.

అసలు మొదలైంది అక్కడి నుంచే

అసలు మొదలైంది అక్కడి నుంచే

అప్పుడు మిథున్‌ రెడ్డి కూడా తనను ప్రశంసించారని ఆ ఇంటర్వ్యూలో రఘురామ చెప్పుకొచ్చారు. అయితే, అదే రోజు రాత్రి తన పైన సీఎం సీరియస్ అయినట్లుగా వార్తలు వచ్చాయన్నారు. ఆ తరువాత సీఎం రమ్మన్నారు..వెళదాం అంటూ మిథున్ రెడ్డి తనతో చెప్పారన్నారు. ఇలా ఎందుకు మాట్లాడావని సీఎం అడగటంతో...నిజానికి భాష మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న వచ్చిందని... అప్పటికప్పుడు తాను అనుబంధ ప్రశ్న అడిగానని వివరించానన్నారు. నాకు అవకాశం రావడంతో మాట్లాడానని చెప్పినట్లుగా వివరించారు. రాష్ట్రం లో ఇలా తెలుగు తీసేస్తున్నారని చెప్పలేదని కూడా వివరించానన్నారు.

ప్రధానితో బంధం గురించీ

ప్రధానితో బంధం గురించీ

దాంతో ఇలాంటివి రిపీట్‌ కాకూడదని జగన్‌ అన్నారని రఘురామ చెప్పుకొచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు తాను సీఎం జగన్ ను కలవటానికి వెళ్లే ముందు పార్లమెంట్‌లో ప్రధాని సెంట్రల్‌ హాలు నుంచి వెళ్లే సమయంలో అనుకోకుండా ఆ పక్కనే ఉన్న నేను తలదించుకుని నమస్కారం పెట్టానన్నారు. ఆయన ఆగిపోయారని..దీంతో..తాను దగ్గరకు వెళ్లానన్నారు. రాజు గారూ అంటూ సంబోధిస్తూ.. భుజం మీద చరిచారన్నారు. అది బాగా చర్చ జరిగిందని రఘురామ చెప్పారు.

ఆ రోజే సస్పెండ్ చేస్తారనుకున్నా

ఆ రోజే సస్పెండ్ చేస్తారనుకున్నా

తాను మరుసటి రోజు సీఎంను కలిసే సమయంలో ఆయన టేబుల్ మీద ఉన్న పత్రికలో తన ఫొటో ఉందన్నారు. దీంతో..ఆ రోజే సస్పెండ్ చేస్తారని భావించానన్నారు. కానీ, అప్పుడు అంతా స్మూత్ గానే జరిగిపోయిందని వివరించారు. తనకు అమిత్ షా కోరిన వెంటనే అప్పాయింట్ మెంట్ ఇవ్వకున్నా.. తమ సీఎం అడిగినన్నిసార్లు నేను అడగనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇక, తన సభ్యత్వం ఎలా రద్దవుతుందని... తాను తన పార్టీని అమితంగా ప్రేమిస్తానని రఘురామ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+