ఏపీ సీఐడీ చీఫ్ పై ఆధారాలతో అమిత్ షాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత టిడిపి నేతలు అక్రమంగా చంద్రబాబుని అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ సిఐడి అధికారులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని మండిపడుతున్నారు.
ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ పై టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ రూల్స్ ను అతిక్రమించి వైసిపి కి మద్దతుగా ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ అందులో కోరారు.

విచారణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. రాజకీయ పక్షపాతం లేకుండా పని చేయాల్సిన సిఐడి అధికారులు, తమ రూల్స్ ను అతిక్రమించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం ప్రతిపక్షాలపై వారు బురద జల్లుతున్నారన్నారు.
సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేస్తున్నారని, ఇది తీవ్రమైన నేరమని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దర్యాప్తు నివేదిక రూపొందించి కోర్టులకు పంపాల్సిన బాధ్యత ఉన్న ఐపీఎస్ అధికారి, వైసిపి నేతలాగా, ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలో ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రతిపక్ష నేతల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన విషయాలను మీడియాకు విడుదల చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ రూల్స్ అతిక్రమించి, అడ్డగోలుగా ప్రవర్తించడాన్ని అన్ని ఆధారాలతో సహా హోంమంత్రికి పంపించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు సిఐడి అధికారులు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని, ఈ వ్యవహారంపై హోం మంత్రి అమిత్ షా దృష్టి సారించాలని ఆయన తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications