జగన్ ఇప్పట్నుంచే ఓట్ల రాజకీయం చేస్తున్నారు .. ఎలాగో చెప్పిన సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే వైసీపీ ప్రభుత్వం కూడా చెబుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని ఆయన అన్నారు. అంతే కాదు ఇప్పటినుండే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఓట్ల రాజకీయం ప్రారంభించారని ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులనే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పిన సుజనా చౌదరి రెవెన్యూ లోటుపై జగన్ ప్రభుత్వం కూడా తప్పుడు లెక్కలను చెప్తోంది అని ఆరోపించారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉందని సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పరిపాలన ప్రారంభమైనట్లు లేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు.ఇక అమిత్‌ షాతో జగన్‌ అపాయింట్‌మెంట్‌ విషయంలో సీఎంవో సరిగా కోఆర్డినేట్‌ చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

MP Sujana Chowdary alleges that jagan started vote politics

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రం నిరాధారమైనదని సుజనా చౌదరి ఆరోపించారు.కేంద్రానికి రెవెన్యూ లోటుపై వినతిపత్రం ఇచ్చానని ప్రజలను మభ్యపెట్టటం జగన్ ఓట్ల రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఇక పోలవరం విషయంలో అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్టు పోలవరం టెండర్లు పిలిచారని వ్యాఖ్యానించారు. రాజధానిలో రూ.9 వేల కోట్ల పనులు జరిగితే రూ.30 వేల కోట్ల దుబారా ఎలా సాధ్యమని అడిగారు.జగన్ ఇప్పటినుంచే ఓట్ల రాజకీయం ప్రారంభించారని అర్థమవుతోందని విమర్శించారు. పోలవరం పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తిగా ఉందని సుజనా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+