వైసీపీ అభ్యర్దుల ఖరారుపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లను కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీట్లు రాని వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో సీట్ల మార్పు..కొత్త వారికి అవకాశం పై పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

మార్పుల వెనుక : పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పార్టీని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. తిరుపతి, చంద్రగరి అభ్యర్దులుగా ఇప్పటికే భూమన - చెవిరెడ్డి కుమారులకు ఖాయం చేసారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ అదాల బరిలోకి దిగనున్నారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నా...అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఛార్జ్ ల మార్పు తొలి జాబితాలోనే ప్రకాశం జిల్లాలో సీట్లలో మార్పులను ప్రకటించారు.

MP Vijaya Sai Reddy made key remarks over incharges Change in YSRCP Ahead Elections

గెలుపే ప్రామాణికం : మంత్రులు ఆదిమూలపు సురేష్, నాగార్జునకు సీట్లు ఖరారు చేసారు. బాలినేని, మాగంటితో విజయ సాయిరెడ్డి సుదీర్ఘంగా చర్చలు చేసారు. తరువాత సీఎం వద్ద సమావేశం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యేగా తిరిగి బాలినేని పోటీ చేయటం ఖాయమైంది. ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా ఆయన కుమారుడు పోటీ పైన ఇంకా నిర్ణయం జరగలేదు. గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. అద్దంకిలో హనిమిరెడ్డిని బరిలోకి దింపారు. దర్శి, గిద్దలూరులో సీట్ల పైన నిర్ణయం జరిగింది. దీంతో..ఇప్పుడు సాయిరెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాలు..అభ్యర్దుల ఎంపిక వెనుక కారణాలను వెల్లడించారు.


సాయిరెడ్డి క్లారిటీ : నియోజకవర్గాల్లో ఎవరైతే సమర్ధత చాటుకున్నారో..ప్రజలతో మమేకం అయ్యారో..నియోజకవర్గాల్లో తమ ముద్ర వేసారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని సాయిరెడ్డి స్పష్టం చేసారు. గెలుపే ప్రాతిపదికగా మెరిట్ ఆధారంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని సాయిరెడ్డి వెల్లడించారు. ఇంతకు మంచి మరే ఆలోచన లేదని సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. దాదాపు 30 నియోజకవర్గాల వరకు మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో 11 మందిని మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం మార్పులతో ఈ రోజు లేదా రేపు వైసీపీ అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, ఈ మార్పుల పైన వైసీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+