
అతడో కట్టప్ప; ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించిన ముద్దాయి: యనమలపై సాయిరెడ్డి ఫైర్
టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా యనమల రామకృష్ణుడు టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి యనమల ఓ కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తిచ్చిన ముద్దాయి అంటూ యనమల రామకృష్ణుడుని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.
హిందూపురంలో
కొనసాగుతున్న
బంద్..
జిల్లా
కేంద్రం
ఏర్పాటుకోసం
పెట్రోల్
పోసుకుని
యువకుడు
ఆత్మహత్యాయత్నం

ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే యనమల పేరే
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పై విరుచుకుపడ్డారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర ఆయనిది అంటూ మండిపడ్డారు. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఏనాడో మర్చిపోయారు ఈ నమ్మకద్రోహిని అంటూ సోషల్ మీడియా వేదికగా యనమల రామకృష్ణుడుని తిట్టిపోశారు విజయసాయిరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి వల్లే ప్రస్తుతం వివిధ పథకాలకు ఆర్థిక వనరుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్ర, యనమలకు పదవులు అందుకే
ఇక
అంతే
కాదు
మరో
పోస్టులో
ఎన్టీఆర్‌కు
వెన్నుపోటు
పొడిచిన
కుట్రలో
చంద్రబాబుకు
కత్తి
అందించిన
ముద్దాయి
యనమల
రామకృష్ణుడు.
అందుకే
తునిలో
ఏ
ఎన్నికలోను
పార్టీని
గెలిపించక
పోయినా
యనమలకు
పదవులు
కట్టబెట్టాడు
బాబు
అంటూ
విజయసాయి
రెడ్డి
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.
ఇలాంటి
ప్రజా
తిరస్కృతుల
వల్లే
పార్టీ
భ్రష్టు
పట్టిందని
కార్యకర్తలు
బహిరంగంగానే
వ్యాఖ్యానిస్తుంటారు
అని
వైసీపీ
రాజ్యసభ
సభ్యుడు
విజయ
సాయి
రెడ్డి
పేర్కొన్నారు.

రాష్ట్రం లోపల సజ్జల రామకృష్ణారెడ్డి వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారన్న యనమల
ఇదిలా ఉంటే అంతకుముందు యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం లోపల సజ్జల రామకృష్ణారెడ్డి వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాష్ట్ర క్యాబినెట్ ను అటకెక్కించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదుగురితో కిచెన్ క్యాబినెట్ నడుపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి మంత్రి వర్గం తోలుబొమ్మ గా మారిందని మొత్తం అధికారాలన్నీ జగన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని, రెడ్ల చేతుల్లోనే పాలన ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు.

ఏపీ మంత్రులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారారని విమర్శలు
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
పెత్తనమంతా
విజయసాయిరెడ్డి,
సజ్జల
రామకృష్ణా
రెడ్డి,
సుబ్బారెడ్డి,
వేమిరెడ్డి
ప్రభాకర్
రెడ్డి,
పెద్దిరెడ్డి
చేతుల్లోనే
ఉందని
విమర్శలు
గుప్పించారు.
ఇక
మంత్రులు
మీడియాతో
మాట్లాడిన
దాఖలాలు
లేవని,
ఏపీ
మంత్రులు
ఉత్సవ
విగ్రహాల
మాదిరిగా
మారారని
విమర్శించారు.
రాష్ట్రంలో
ప్రతి
దానికీ
సలహాదారులు
స్పందిస్తున్నారు
అంటూ
మండిపడ్డారు.
సజ్జల
మాట్లాడుతుంటే
ఆయన
వెనక
నామమాత్రంగా
మంత్రులు
బొత్స
సత్యనారాయణ,
పేర్నినాని,
బుగ్గన
రాజేంద్రనాథ్
నిల్చోవడం
కన్నా
ఘోరం
లేదని
మాజీ
మంత్రి
యనమల
రామకృష్ణుడు
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
Recommended Video

సాయిరెడ్డి మాత్రమే మాట్లాడుతున్నారన్న యనమలకు కౌంటర్ వేసిన సాయిరెడ్డి
రాష్ట్రం నుంచి 20 మంది అధికారులతో బుగ్గన ఢిల్లీకి వెళితే, మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాత్రమే మాట్లాడారని, దీని పై బుగ్గన క్షోభ పడుతున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇక తాజాగా యనమల రామకృష్ణుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన క్రమంలో విజయ సాయి రెడ్డి తిరిగి యనమల రామకృష్ణుడుపై విరుచుకుపడ్డారు.