పురందేశ్వరిది కుటుంబ అజెండా, ఆ వర్గం కోసమే - సాయిరెడ్డి..!!
పురందేశ్వరిది నిలకడలేని రాజకీయమని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. వైసీపీ పెత్తందారుల పార్టీ కాదు.. పేదల, బలహీన పార్టీ అని తెలిపారు. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని.. ఆయన వలన అభివృద్ధి చెందిన చంద్రబాబు వర్గీయులేనని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు పట్ల ప్రజలు సానుభూతి చూపించడం లేదని చెప్పుకొచ్చారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని.. స్వార్ధ, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పురందేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని.. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. పురందేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. లిక్కర్ విషయంలో తనపై , మిథున్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు పాపం పండింది కనుకే జైల్లో వున్నారని.. పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని విజయసాయిరెడ్డి తెలిపారు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని.. చంద్రబాబులా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి వర్గం కూర్పులోనూ సామాజిక న్యాయం చేశామని సాయిరెడ్డి వివరించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోందని సాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని పేర్కొన్న సాయిరెడ్డి అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications