చంద్రబాబు కేసు, రాజ్యసభలో సాయిరెడ్డి సంచలనం..!!
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ ఈ అంశాన్ని వివరిస్తూ ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. దీనికి వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. చంద్రబాబు ప్రమేయం పైన ఆధారాలను మిధున్ రెడ్డి ప్రస్తావించారు. అటు రాజ్యసభలో చంద్రబాబు కేసు..అవినీతికి పాల్పడ్డారంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. దీని పైన టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్లమెంట్ లో చంద్రబాబు ఎపిసోడ్:పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజునే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్వల్ప వాగ్వాదం జరిగింది. తొలుత లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమని..ఈ అరెస్ట్ ఏపీకి బ్లాక్ డే గా పేర్కొన్నారు.

ఎక్కడా చంద్రబాబుకు డబ్బులు అందినట్లు ఆధారాలు లేవన్నారు. దీని పైన ప్రధాని, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ సమయంలోనే వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో, కోర్టులో విచారణలో ఉన్న సమయంలో సభలో ఈ అంశం ప్రస్తావన సరికాదంటూ స్పీకర్ వారించారు.
రాజ్యసభలో సాయిరెడ్డి వ్యాఖ్యలు:అటు రాజ్యసభలో చంద్రబాబు అవినీతి పైన వైసీపీ నేత సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు.
తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆధారాలతోనే అరెస్ట్:స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్ కస్టడీ విధించిందని వివరించారు. టిడిపి పార్లమెంట్ సభ్యుల అనుచిత చర్యలకు సమాధానంగానే ఈరోజు చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపైన టీడీపీ ఎంపీ కనకమేడల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications