మాటకు మాట ఘాటుగానే: పురందేశ్వరి వ్యాఖ్యలకు సాయిరెడ్డి కౌంటర్!!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకమార్లు మొన్నటి వరకు జైల్లో ఉన్న చంద్రబాబు కోసం పురందేశ్వరి ప్రవర్తించిన తీరును విమర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఏపీలో ఇసుక, మద్యం, మట్టిలో అక్రమాలు జరుగుతున్నాయని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవినీతి కేసులో ముద్దాయి చంద్రబాబు గారిని వెనకేసుకొచ్చే పురందేశ్వరి గారు ఇసుక, మద్యం, మట్టిలో అక్రమాలు జరుగుతున్నాయని కలగనడం హాస్యాస్పదం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ప్రజలంతా ఒకలా అనుకుంటే పురందేశ్వరి గారు ఇంకోలా భ్రమపడుతుంటారు అని సెటైర్లు వేశారు. ప్రభుత్వంపై నిందలేసే ముందు మీరు, మీ భర్త, మీ కుమారుడు ఎంత నిజాయితీపరులో ఆలోచించుకోవాలి అని టార్గెట్ చేశారు.

 MP Vijayasai reddy strong counter to purandeswari comments on ap sand and liquor

అంతేకాదు పురందేశ్వరి గారు...మీరు ఇసుక ర్యాంప్స్, వైన్ షాప్స్ కి వెళ్తుంటే కనీసం నలుగురు బీజేపీ నాయకులైనా మీతో వస్తున్నారా? అని ప్రశ్నించారు. అసలు మీరు ఏ పార్టీ కోసం పని చేస్తున్నారో బీజేపీ నాయకులకే కాదు, ఆ పార్టీ క్యాడర్ కూ తెలుసు అంటూ పేర్కొన్న ఆయన పురందేశ్వరి బీజేపీ కోసం కాదు టిడిపి కోసం పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

మీకు సపోర్ట్ గా టీడీపీవారు మాత్రమే మైకుల ముందుకు వస్తున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. తరచుగా పార్టీలు మారే మీరు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే పని చేయండి అంటూ ఆమెకి హితవు పలికారు. అంతకుముందు కూడా పురందేశ్వరిని టార్గెట్ చేసిన సాయిరెడ్డి బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి గారు 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందే అన్నారు.

మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. 33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బిజెపి పెద్ద సాహసమే చేసిందని పేర్కొన్నారు. గత ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన పురందేశ్వరిని ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎలా నియమించారో అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన ఆమెను టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+