విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం మనోడే..విశాఖ మనదే..ఇక అడ్డెవరు: సాయిరెడ్డి తీరుతో కొత్త వివాదాలు..!

|
Google Oneindia TeluguNews

విశాఖ : ఉత్తర్వులు ఇచ్చేది మేమే.. వాటిని ఉల్లంఘించేది మేమే అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల వ్యవహారం. ఛాన్స్ దొరికితే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసే సీఎం సన్నిహితుడు ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా తానే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అంతేకాదు రక్తదానం నిషేధిస్తూ కొద్దిరోజుల క్రితం జీవోను సైతం జారీ చేసింది. కానీ రాజులం మేమే కదా మాకు జీవోలు ఏంటని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విజయసాయిరెడ్డి... ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రక్తదానం చేయడం ఇటు పార్టీలోను అటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

వైసీపీలో నెంబర్ 2 అని చెప్పుకునే విజయసాయిరెడ్డి ఇప్పుడు విశాఖను కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నారు. విశాఖను పాలనా రాజధాని చేయాలనే నిర్ణయాన్ని ముందే సాయిరెడ్డి ఉక్కునగరంలో కీలకంగా మారారు. అన్నీ తానై చూస్తున్నారు. నిత్యం ట్వీట్లు ద్వారా చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడే సాయిరెడ్డి సున్నితమైన కీలకమైన లాక్‌డౌన్ సమయంలో రక్తదానం చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. సొంత ప్రభుత్వం ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పార్టీలో పెద్దగా, పెద్దల సభలో సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డి తీరు విమర్శలకు కారణమైంది.

MP Vijaysai Reddy breaks lockdown rules, donates blood

సోషల్ డిస్టెన్స్‌కు అర్థం లేకుండా వైరస్ విస్తరిస్తున్న వేళ రక్తదానం చేయడం సొంత పార్టీ నేతలకు సైతం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ ఆదేశాలను సొంత పార్టీ ఎంపీనే ధిక్కరించడం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. గతంలోను సాయిరెడ్డి కొన్ని అసందర్భ వ్యాఖ్యలతో పార్టీ ఇరకాటంలో పడింది. రక్తదానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సాయిరెడ్డి మాత్రం స్పందించడం లేదు. ఇంకా దీనిపైన ఇప్పుడు సీఎం ప్రభుత్వం ప్రధానంగా విశాఖ అధికారులు ఏరకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Coronavirus : 21 Indian Navy Sailors Test Positive For COVID-19

English summary
MP Vijaysai Reddy is being criticized for having crossed the lockdown rules. Few days back AP govt had issued orders that none should donate blood during this lockdown period. But SaiReddy had done this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X