ప్రజల కోరిక మేరకే కొత్త జిల్లాలు: ఎంపీ వినోద్
హైదరాబాద్: ప్రజల కోరిక మేరకే జిల్లాల విభజన ప్రక్రియ కొనసాగుతున్నదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సమైక్య రాష్ట్రంలో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇప్పుడు 2 వేల కిలోమీటర్ల రహదారులు వచ్చాయని తెలిపారు.
రాష్ర్టానికి రూ. 90 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పడం సరికాదన్నారు. అది తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా అని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే న్యాయమైన వాటా కోసమని పేర్కొన్నారు. 2006లోనే రాష్ట్ర విభజనతో పాటు జిల్లాల విభజన అని కూడా అన్నామని గుర్తు చేశారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధితో పాటు నవోదయ పాఠశాలలు వస్తాయన్నారు. 60 ఏళ్లలో తెలంగాణకు 9 నవోదయ పాఠశాలలు మాత్రమే వచ్చాయని తెలిపారు. జిల్లాలపై ఎవరూ అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications