షర్మిలను కార్నర్ చేసిన వైసీపీ..!!

YV Sharmila: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తనతో పాటు తన భర్త అనిల్, బంధువులు, దగ్గరి వాళ్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్వయంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని అన్నారు. ట్యాపింగ్ ఆడియో ఒకటి తనకు వినిపించారని స్పష్టం చేశారు.

MP YV Subba Reddy reacts on YS Sharmila s Phone tapping allegations

ఫోన్ ట్యాపింగ్‌ పై విచారణకు ఎక్కడికైనా వస్తానని.. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కే కుట్ర జరిగిందని ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి ఫోన్ ట్యాపింగ్ ప్లాన్ చేశారని షర్మిల ధ్వజమెత్తారు.

ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా విషయంగా అనిపించిందని పేర్కొన్నారు షర్మిల. అందుకే ఆ విషయాలను అప్పట్లో బయట చెప్పలేకపోయానని వివరించారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారని మండిపడ్డారు.

షర్మిల చేసిన ఈ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఘాటుగా బదులిస్తోంది. దీనిపై పలువురు నాయకులు స్పందిస్తోన్నారు. వైవీ సుబ్బారెడ్డి పేరు రావడం, ఆయనపై ఆరోపణలు చేయడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోన్నారు. షర్మిలపై ఎదురుదాడికి దిగుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరును ప్రస్తావించడం పట్ల వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని అప్పటి ఏపీ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని గుర్తు చేశారు.

అప్పట్లో వైఎస్ జగన్‌, షర్మిలకు సంబంధాలు ఇలా ఉండేవి కావని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ ను ట్యాప్‌ చేసి కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి ముఖ్యమంత్రికి ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదని పేర్కొన్నారు. టీడీపీకి సంబంధించిన టీవీలు, పత్రికల్లో తనపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+