వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీల సస్పెన్షన్: నేలపై కూర్చుని నిరసన తెలిపిన చిరంజీవి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గురువారం నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్ష‌న్‌పై మూడు రోజులుగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ నేతలంతా ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

గురువారం ఆందోళనలో భాగంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న చిరంజీవి ముందు వరుసలో నేలపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్‌ను తన ఆందోళనలతో ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతురావు కూడా చిరంజీవి పక్కనే కూర్చున్నారు. ఇది ఇలా ఉంటే పార్లమెంట్‌లో సమావేశాల ప్రతిష్టంభన కొనసాగుతోంది.

MPs' Suspension: Chiranjeevi sitting before gandhi statue

25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌పై గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి ప్రతిపక్ష సభ్యులు మద్దుతుగా నిలిచారు. దీంతో విపక్షాల ఆందోళనతో వరుసగా మూడోరోజు సభలో గందరగోళ పరిస్ధితి కొనసాగుతోంది.

కాగా, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉధంపూర్‌ జిల్లాలో ఉగ్రవాదుల దాడి ఘటపై కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.

English summary
MPs' Suspension: Chiranjeevi sitting before gandhi statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X