కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీచినా గెలిచింది, ముందే మృతి

కానీ తీరా గెలుపు వరించే సమయానికి ఆమె భౌతికంగా లేరు. గత నెల 21న ఉన్నట్లుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. స్వగ్రామంలోనే ఆమె మృతి చెందారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో చిలుకమ్మ గెలుపొందారు. అధికారులు ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించినా ఆమె మృతి చెందడంతో రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
కాగా, విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు కాంగ్రెసు ఎక్కడా గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లోను పునరావృతమయ్యాయి.
టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వరుసగా ఐదువేలు, నాలుగువేల ఎంపీటీసీలను, 374, 274 జెడ్పీటీసీలను కైవసం చేసుకోగా.. కాంగ్రెసు పార్టీ మాత్రం కేవలం 139 ఎంపీటీసీలు, రెండు జెడ్పీటీసీలను మాత్రమే గెలుచుకుంది. కాగా, కాంగ్రెసు పార్టీకి ఎదురు గాలి వీచిన సమయంలోను గెలిచిన చిలుకమ్మ మృతి చెందడం అందర్నీ కదిలించింది.
తెలంగాణలో లోక్‌సత్తా బోణీ
స్థానిక సంస్థల్లో లోక్‌సత్తా పార్టీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుని బోణీ కొట్టింది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి ఎంపీటీసీ స్థానంలో లోక్‌సత్తా అభ్యర్థి బాలచంద్రన్ 40 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications