వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకల్ పోరుకు రైట్.. రైట్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నిలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Local Body Elections 2020 : ZPTC & MPTC Polls In 2 Phase, Panchayat Polls To Be Held In 3 Phase

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ‌తోపాటు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా విభాగాల్లో రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంది. అయితే 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ప్రక్రియకు ఆటంకం కలిగింది.

రిజర్వేషన్లపై పిటిషన్

రిజర్వేషన్లపై పిటిషన్

సుప్రీంకోర్టు నియమాల ప్రకారం ఆయా సంస్థలకు సంబంధించి ఎన్నికలు రిజర్వేషన్ 50 శాతానికి మించొద్దు. కానీ జగన్ ప్రభుత్వం 59.85 రిజర్వేషన్లు ఖరారు చేయడంపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వచ్చింది. దీంతో వారు హైకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను అలకించింది.

షెడ్యూల్‌కు ఓకే..

షెడ్యూల్‌కు ఓకే..

స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు వాదనలు కూడా ధర్మాసనం అలకించింది. ప్రభుత్వ అఫిడవిట్‌కు హైకోర్టు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌కు హైకోర్టు ఆమోదం తెలిపింది.

రెండవిడతలో పోలింగ్

రెండవిడతలో పోలింగ్

షెడ్యూల్ ప్రకారం జెడ్పీటీసీ ఎన్నికలను రెండువిడతల్లో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన నోటిపికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఏపీలో 13 జిల్లాలకు గానూ పదమూడు జెడ్పీ పీఠాలు ఉన్నాయి.

మూడుదశల్లో పంచాయతీ పోల్

మూడుదశల్లో పంచాయతీ పోల్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. మూడుదశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 59.85 రిజర్వేషన్లు చట్టవిరుధ్దమని, స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా.. హైకోర్టు తిరస్కరించింది. రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇవ్వబోమని తేల్చిచెప్పింది. అంతేకాదు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మార్చి 3 లోపు పూర్తిచేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టంచేసింది.

English summary
mptc, zptc election is two phase, panchayat is 3 phase ap highcourt order to election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X