బిసిలతో తగాదాలు పెట్టాలని.. బీసీ కోటాలో వద్దు: ముద్రగడ
తమకూ బీసీలకు మధ్య తగాదాలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, తాము బీసీ కోటాలో రిజర్వేషన్లు తీసుకోబోమని ముద్రగడ పద్మనాభం అన్నారు.
రాజమహేంద్రవరం: బీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తీసుకోబోమని, తమకు ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోటా కేటాయించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. బీసీలుకు, కాపులకు మధ్య తగాదా పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము ఇక ఐక్యంగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.
మంజునాథ కమిషన్‌కు వినతిపత్రా లు ఇవ్వడానికి కాపులకో రోజు, బీసీలకో రోజు కేటాయించాలని అడుగుదామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తన అనుచరులతో కలసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు ఇంటిలో వివిధ బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.

వారితో చర్చలు జరిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీలలో చేర్చితే ప్రస్తు త బీసీలకు నష్టం జరుగుతుందేమోననే అనుమానం ఉందని, అందువల్ల వారి అనుమానాలు నివృత్తి చేయడానికి బీసీ నేతల ఇంటికి వెళుతున్నానని ఆయన చెప్పారు.
తొలుత బీసీసంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిని కలిస్తే పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభా్‌షచంద్రబోస్, మార్గాని నాగేశ్వరరావు వంటి నేతలు అటువంటి అభ్యంతరాలే వ్యక్తం చేశారన్నారు.
వాస్తవానికి బీసీలు పొందుతున్న రిజర్వేషన్లు తమకు అవసరం లేదని, వాటిని ఇచ్చినా తాము తీసుకునేది లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా పెంచి, వర్గీకరణలో తమకు ఓ గ్రూపు కేటాయించాలని మాత్రమే ఉద్యమిస్తున్నామని ఆయన అన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications