నా అనుభవమంత లేడు: జగన్‌పై ముద్రగడ ఆసక్తికరం, బాబు భేష్

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వయస్సు తన రాజకీయ అనుభవమంత లేదని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన ఆదివారం నాడు విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు.తాను రాజకీయ పార్టీలకు అమ్ముడు పోలేదని చెప్పారు. తన జాతిని ఎవరికీ తాకట్టు పెట్టలేదని చెప్పారు. తాను చేసిన దీక్ష తెల్ల చొక్కాల కోసం కాదని, పేదలకు గౌరవం కల్పించేందుకేనని ముద్రగడ స్పష్టం చేశారు.

Mudragada interesting comments on YS Jagan

కాపు రిజర్వేషన్ వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తాను పిరికివాడిలా పారిపోనని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. నాపై నా జాతి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు.

హామీలు నెరవేర్చకుంటే పిరికివాడిలో పారిపోనని చెప్పారు. త్వరలో ఉద్యమ తేదీ ప్రకటిస్తానని చెప్పారు. తన పోరాటం పేదల కోసమని, రాజ్యాధికారం కోసం ఎంతమాత్రమూ కాదని చెప్పారు. ఆలస్యంగా అయిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చంద్రబాబు చెప్పడం సంతోషకరమన్నారు. జగన్ చెబితే తాను ఏదో చేస్తాననడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+