అప్పుడు మాట్లాడుతా: ముద్రగడ హౌస్ అరెస్ట్, ఇంటిపై డ్రోన్ కెమెరాలు
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం బుధవారం నాడు రావులపాలెంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున మంగళావారమే పోలీసులు మోహరించ
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం బుధవారం నాడు రావులపాలెంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున మంగళావారమే పోలీసులు మోహరించారు.
ఆయన ఇంటి పైన డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముద్రగడ కదలికల పైన పోలీసులు కన్ను వేశారు. ముద్రగడ ఇంటి వద్ద భారీగా పోలీసులు ఉన్నారు. రాజమండ్రిలోను కాపు నేతలను హౌస్ అరెస్టు చేశారు.
ముద్రగడ హౌస్ అరెస్ట్
రేపు రావులపాలెంలో ప్రారంభించనున్న పాదయాత్ర కోసం కిర్లంపూడిలోని తన ఇంటి నుంచి ముద్రగడ సాయంత్రం బయటకు వచ్చారు. కాపు సత్యాగ్రహ దీక్ష కోసం రావులపాలెం వెళ్లేందుకు బయటకు వచ్చారు. ఆయన గేటు బయటకు రాగానే పోలీసులు అతనిని హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

పాదయాత్ర వాయిదా: ముద్రగడ
తన పాదయాత్రను వాయిదా వేసుకున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనకు పూర్తి స్వేచ్ఛ వచ్చాక మాట్లాడుతానని తెలిపారు. తాను పాదయాత్ర వాయిదా వేసుకున్నానని, విరమించుకున్నట్లు కాదన్నారు. మరోసారి చర్చించాక మాట్లాడుతానన్నారు.
హౌస్ అరెస్టు చేస్తాం
శాంతిభద్రతల దృష్ట్యా కాపు నేతలను, ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్టు చేస్తామని డీజీపీ సాంబశివ రావు అంతకుముందు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే దేనిని తాము అంగీకరించేది లేదని చెప్పారు. ముద్రగడ సహా ఎవరైనా అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు.












Click it and Unblock the Notifications