వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమపై జగన్ నిర్ణయంతో - ముద్రగడ బహిరంగ లేఖ..!!

|
Google Oneindia TeluguNews

కోనసీమ జిల్లా పేరు వివాదంతో వరుసగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం పేరుకు వ్యతిరేకంగా విధ్వంసం.. వారి పైన కేసులు నమోదయ్యాయి. ఇక, సామాజిక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కాపు ఉద్యమనేత ముద్రగద స్పందించారు. కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమ జిల్లాకు ప్రభుత్వం కొందరి డిమాండ్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు ప్రతిపాదిస్తూ అభ్యంతరాలు - సూచనలు స్వీకరించేందుకు నోటీఫికేషన్ జారీ చేసింది.

కోనసీమ జిల్లా పేరు వివాదం

కోనసీమ జిల్లా పేరు వివాదం

దీంతో..కొందరు పేరుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. అమలాపురంలో విధ్వంసం.. మంత్రి ఇల్లు దహనానికి పాల్పడ్డారు. వారందిరిపైనా కేసులు నమోదయ్యాయి. రాజకీయంగానూ ఈ పేరు విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు.. ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఇక, తాజాగా.. స్థానికంగా బలమైన సామాజిక వర్గాలు సమావేశం నిర్వహించాయి. ఇక, స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు - సూచనలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

అంబేద్కర్ పేరు ఖరారు చేసిన ప్రభుత్వం

అంబేద్కర్ పేరు ఖరారు చేసిన ప్రభుత్వం

దీంతో..ప్రభుత్వం కోనసీమ జిల్లాకు ముందుగా నిర్ణయించిన విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు కాపు ఉద్యమ నేతగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ పేరు ఖరారు చేయటం పైన స్పందించారు. కోనసీమ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని పేర్కొన్నారు. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని గుర్తు చేసారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించటంలో న్యాయం లేదని చెప్పారు.

మద్రగడ లేఖ ద్వారా

మద్రగడ లేఖ ద్వారా

అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని ముద్రగడ సూచించారు. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గుర్తు చేసారు. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. దీంతో..ఇప్పుడ కోనసీమ ప్రాంతంలో ఈ పేరు పైన ఇంకా కొంత మంది చర్చలు చేస్తున్న సమయంలో ముద్రగడ రాసిన లేఖ ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ సమర్ధించారు. వ్యతిరేకించటం సరి కాదని సూచించారు.

English summary
Kapu leader Mudragada Padmanabham open letter to Konaseema public on district name as Dr Ambedkar konseema dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X