వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్లు: చంద్రబాబుపై అనుమానాలు, ముద్రగడ ఏం చేస్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Kapu Reservations : Mudragada on 5 Percent qouta for Kapus | Oneindia Telugu

అమరావతి: కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వే,న్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం బిల్లును ఆమోదించింది. దాన్ని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. అయితే, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికార తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది.

అయితే, తెలుగుదేశం పార్టీకి చెందనివారు, కాపు నేత ముద్రగడ పద్మనాభం వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై నెపాన్ని నెట్టేందుకు మాత్రమే చంద్రబాబు చర్యలు చేపట్టారని, కాపులకు చంద్రబాబు చెప్పిన పద్ధతలో రిజర్వేషన్లు అమలు చేయడం అయ్యే పని కాదని అంటున్నారు.

కోటాపై ముద్రగడ ఏమంటారు..

కోటాపై ముద్రగడ ఏమంటారు..

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముద్రగడ పద్మనాభం మాట్లాడడానికి నిరాకరించారు. కాపు జెఎసి సమావేశంలో చర్చించిన తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. ఆయన ఏం మాట్లాడుతారనే విషయంంపై ఆసక్తి నెలకొని ఉంది.

మరోసారి మోసం చేయడమేనని...

మరోసారి మోసం చేయడమేనని...

రిజర్వేషన్లపై కాపులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి కటారి అప్పారావు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు.

కోల్ట్ స్టోరేజీకి పంపడమేనని...

కోల్ట్ స్టోరేజీకి పంపడమేనని...

రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్రానికి పంపడమంటే ఈ అంశాన్ని కోల్డ్‌స్టోరేజీలో పెట్టడమేనని కటారి అప్పారావు విమర్శించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమబాట పడతామని, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు వెనుకకు తగ్గబోమని కటారి అప్పారావు అన్నారు.

ఐదు శాతమేనా...

ఐదు శాతమేనా...

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ముద్ర‌గ‌డ వ‌ర్గీయులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. 20 శాతం ఉన్న కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు అనడం స‌రికాద‌ని కాపు నేత‌లు అంటున్నారు. శ‌నివారం కిర్లంపూడిలో కాపు జేఏసీ నేత‌లు స‌మావేశమై ఎలా స్పందించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.

ముద్రగడ 6వ తేదీ డెడ్ లైన్ పెట్టారు....

ముద్రగడ 6వ తేదీ డెడ్ లైన్ పెట్టారు....

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై డిసెంబ‌రు 6 వ‌ర‌కు డెడ్ లైన్ అని , ఆలోగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆదివారంనాడు చెప్పారు. ఈ నేపథ్యంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబ‌రు 6 వ తేదీ లోపు కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోని ప‌క్షంలో మ‌రోసారి రోడ్డెక్కుతామ‌ని ముద్రగడ ఆదివారంనాడు స్ప‌ష్టం చేశారు.

రిజర్వేషన్లపై గంటా హర్షం

రిజర్వేషన్లపై గంటా హర్షం

కమిషన్‌ను ఏర్పాటుచేసి దాని నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఇది సీఎం చిత్తశుద్ధికీ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. బీసీ సోదరులు కూడా అర్థం చేసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించారని ఆయన అన్నారు.

కోటా ముద్రగడ వల్ల రాదని...

కోటా ముద్రగడ వల్ల రాదని...

కాపులకు రిజర్వేషన్‌ చంద్రబాబు వల్లే వస్తుందని, ముద్రగడ వల్ల రాదని నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. అని చినరాజప్ప తెలిపారు. కాపులు, బీసీలు సీఎం చంద్రబాబుకు రెండు కళ్లు అని, జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ రాష్ట్రమంతటా పర్యటించి కాపులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని గుర్తించిందని రామానుజయ చెప్పారు వారికి రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలనే అంశం చర్చకే రాలేదని, కాపులకు, బీసీలకు చిచ్చుపెట్టడానికి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కాపులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. కాపులు, బీసీలకు చిచ్చుపెట్టడానికి కొందరు ముద్రగడ పద్మనాభాన్ని తెరపైకి తెచ్చారని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

English summary
Kapu leader Mudragada has not made any comment on the decission taken by Andhra Pradesh CM Nar Chandrababu naidu's government on 5 percent qouta for Kapus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X