తెరపైకొచ్చిన ముద్రగడ- జగన్ కు రాసిన లేఖలో..: టీడీపీ మాజీమంత్రుల పేర్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కొద్దిరోజుల కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటోన్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే స్పందించి డాక్టర్లు, ఆసుపత్రి మేనేజ్మెంట్తో మాట్లాడి, ఎప్పటికిప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Mudragada Padmanabham s touching letter to YS Jagan A Must-Read

ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ తన ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఆరా తీశారని, ఎటువంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కష్ట సమయంలో జగన్ తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, అండగా నిలబడినందుకు ఎప్పటికి రుణపడే ఉంటామని అన్నారు.

పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, చిర్ల జగ్గిరెడ్డి, ఆకుల వీర్రాజు, చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, వంగా గీత, చలమలశెట్టి సునీల్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ముద్రగడ చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, యనమల కృష్ణుడు గారు, అంగూరి లక్ష్మీశివ కుమారి, జ్యోతుల నెహ్రూ, దౌవులూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా తన కుటుంబానికి అండగా నిలిచినందకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు.

హైదరాబాద్ కు తరలించడానికి వైఎస్ జగన్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీలు, వర్గాలు, కుల-మతాలు, ప్రాంతాలకు అతీతంగా తనకు, తన కుటుంబానికి అండగా ఉన్నారని అన్నారు. జగన్ కు ఎప్పుడు, ఎలాంటి కష్టం అండగా ఉంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+