చంద్రబాబు సర్కారు మా కుటుంబాన్ని హింసిస్తోంది: ముద్రగడ తనయుడు బాలు

విశాఖపట్నం: కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హింసిస్తోందని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు బాలు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తన తండ్రి ముద్రగడ దీక్షను విరమించలేదని స్పష్టం చేశారు. ముద్రగడకు బలవంతంగా వైద్యం చేసినా తర్వాత దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. ఏదైనా మాట్లాడాలంటే కాపు జేఏసీని సంప్రదించాలని అన్నారు.

తుని ఘటనకు సంబంధించి అరెస్టులపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిదని ముద్రగడ తనయుడు బాలు అన్నారు.

ragada

ఇది ఇలా ఉండగా, తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరవధిక దీక్ష ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది.

కాపుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

తూర్పుగోదావరి: పి.గన్నవరంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా కంచాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+