ముద్రగడ ఆరోగ్యం పై కీలక అప్డేట్..!!
కాపు ఉద్యమ నేత.. వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కొంత కాలంగా ముద్రగడ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా అస్వస్థతకు గురి కావటంతో ఆయన్ను కాకినాడ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే హైదరాబాద్ తరలించాలని భావించారు. అయితే, షుగర్ లెవల్స్ పూర్తిగా పడి పోవటంతో.. కాకినాడ ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. ముద్రగడను ఆస్పత్రిలో ఆయన కుమార్తె పరామర్శించారు. వైద్యులు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలం క్రితం ఆయన కుమార్తె తన తండ్రి క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారంటూ అప్పట్లో ట్వీట్ చేసారు. కాగా, తాను వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని ముద్రగడ చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో హైదరాబాద్ తరలించాలని భావించారు.

షుగర్ లెవల్స్ ప్రమద కరం గా మారటంతో కాకినాడ మెడికోవర్ ఐసియు లో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడకు డయాలసిస్ చేస్తున్నామని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభంను కుమార్తె క్రాంతి పరామర్శించారు.
డాక్టర్లను క్రాంతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు గిరి చెబుతున్నారు. కుమార్తెను పరామర్శకు అనుమతించటం పైన గిరి ఆగ్రహం వ్యక్తం చేసారు. తన అనుమతి లేకుండా ఎవరినీ పంప వద్దని చెబుతున్నారు. అయితే, ముద్రగడ స్పృహలో లేరు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండటంతో.. పరిస్థితికి అనుగుణంగా చికిత్స లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నారు. కాగా, ముద్రగడ ఆరోగ్యం పైన ఆయన అభిమానులు... పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications