ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ
అమరావతి: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మంగళవారం సాయంత్రం అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు.
అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో ముఖేష్ అమరావతికి చేరుకున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు.

నేరుగా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రానికి (ఆర్టీజీ) వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీజీ పరిశీలించారు. దాని పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.












Click it and Unblock the Notifications