వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో పొత్తులు తేలిపోయాయి, బ‌హుముఖ పోరే : కింగ్ ఎవ‌రు..కింగ్ మేక‌ర్ ఎవ‌రు...!

|
Google Oneindia TeluguNews

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల పై దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. పొత్తులు లేకుండానే పార్టీలు బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించాయి.ఈ సారి ఎన్నిక‌ల్లో బ‌హుముఖ పోరు త‌ప్పేలా లేదు. మ‌రి..ఈ పోరు ఏ పార్టీకి క‌లిసి వ‌చ్చేను. కింగ్ ఎవ‌రు.. కింగ్ మేక‌ర్ ఎవ‌రు.. ఎవ‌రికి కలిసివ‌చ్చేను. ఏపిలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌ధాన పార్టీలు పొత్తు లేకుండా పోటీకి దిగుతున్నాయి. ఇది అధికా రంలో ఉన్న టిడిపికి క‌లిసి వ‌స్తుందా..లేక ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసిపి కి ప్ల‌స్ అవుతుందా..జ‌న‌సేన ప‌ట్టు సాధిస్తుందా.. ఏపి రాజ‌కీయాల్లో ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది..

బహుముఖ పోరు త‌ప్పదు ఇక‌..

బహుముఖ పోరు త‌ప్పదు ఇక‌..

ఏపిలో బ‌హుముఖ పోరు త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే బిజెపి తో ఏ పార్టీ జ‌త క‌ట్టే ప‌రిస్థితి లేదు. కాంగ్రెస్ సైతం ఒంట‌రిగా నే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక‌, అధికార టిడిపి చ‌రిత్ర‌లో తొలి సారి ఒంట‌రి పోరుకు సిద్దం అవుతోంది. ప్ర‌తిప‌క్ష వైసిపి తొలి నుండి ఒంట‌రి పోరు వైపే మొగ్గు చూపుతోంది. ఇక‌, జ‌న‌సేన తాము వామ‌ప‌క్షాల‌తో పొత్తు పెట్ట‌కుంటామ‌ని 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో..ఏపిలో అయిదు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు రంగంలోకి దిగుతున్నా రు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి-బిజెపి-ప‌వ‌న్ క‌ళ్యాన్ ఒక వైపు..వైసిపి ఒంట‌రిగా..కాంగ్రెస్ మరో వైపు పోటీ చేసాయి. కేవ‌లం 1.95 శాతం ఓట్ల తేడా మాత్రమే అధికార - విప‌క్షాల మ‌ధ్య క‌నిపించింది. ఇక‌, ఇప్పుడు అదే 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదు పార్టీలు బ‌రిలో ఉండ‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో అధికారం కోసం మూడు పార్టీలు ప్ర‌ధానంగా పోటీ ప‌డుతున్నాయి. దీంతో..ఇప్పుడు ప్ర‌ధానంగా ఓట్ల శాతం మీద‌నే ఫ‌లితాలు ఆధార ప‌డి ఉంటాయి.

ఓట్లు చీలుతాయా..ఎవ‌రికి క‌లిసి వ‌చ్చేను..

ఓట్లు చీలుతాయా..ఎవ‌రికి క‌లిసి వ‌చ్చేను..

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, టిడిపి తో పొత్తు వ‌ద్ద‌ని కాంగ్రెస్‌.. ఏపిలో పొత్తు వ‌ద్ద‌ని..విడివిడిగా పోటీ చేసి క‌ల‌సి ఉందామ‌ని టిడిపి ప్ర‌తిపాదించింది. దీని మేర‌కే ఏపి కాంగ్రెస్ లో పొత్తు లేద‌ని తేల్చేసింది. ఇక‌, జ‌న‌సేన - బిజెపి గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి కి మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు టిడిపితో విభేదించ‌టంతో ప‌వ‌న్ మ‌ద్ద‌తు దారుల ఓట్లు జ‌న‌సేన‌కు ప‌డ‌తాయి. బిజెపికి ఓటింగ్ శాతం ఈ సారి ఏపిలో చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా. ఇక‌, కాంగ్రెస్ గ‌త కంటే పుంజుకున్నా..ఏ స్థాయిలో ఓట్ల‌ను చీ ల్చుతుందీ..ఎవ‌రికి న‌ష్టం చేస్తుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌. ఇక‌, సాధార‌ణంగా బ‌హుముఖ పోరు జ‌రిగే స‌మ‌యంలో అధికా ర పార్టీ పై ఉన్న ఏర్ప‌డే వ్య‌తిరేకత కార‌ణంగాద‌..వ్యతిరేక ఓట్లు చీలితే..అది అధికార పార్టీకి మేలు చేస్తుంది. అయితే, ఈ వ్య‌తిరేక ఓటు జ‌గ‌న్ కా..ప‌వ‌న్ కా.. అదే విధంగా వారికి వ‌చ్చే ఓట్ల‌తో పాటుగా టిడిపి వ్యతిరేక ఓట్ల‌ను ఎంత వ‌ర‌కు క్యాష్ చేసుకుంటార‌నేది కీల‌కంగా మార‌నుంది. ఈ చీలిక టిడిపికి కలిసి వ‌స్తుందా అనేది మ‌రో చ‌ర్చ‌.

కింగ్ ఎవ‌రు..కింగ్ మేక‌ర్ ఎవ‌రు..!

కింగ్ ఎవ‌రు..కింగ్ మేక‌ర్ ఎవ‌రు..!

ఇక‌, ఏపిలో పొత్తుల సంగ‌తి తేలిపోవ‌టంతో..ఇప్పుడు ఎవ‌రి స‌త్తా ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. బ‌హుముఖ పోరు ఖ‌చ్చి తంగా త‌మ‌కే క‌ల‌సి వ‌స్తుంద‌ని..త‌మ‌కు ఉన్న పాజిటివ్ ఓటు ఎలాగో త‌మ‌కే ద‌క్కుతుంద‌ని..అదే స‌మ‌యంలో ప్ర‌భు త్వ వ్య‌తిరేక ఓటు చీలిపోవ‌టం ద్వారా..తాము తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌ని టిడిపి అంచ‌నా వేస్తోంది. అయితే, ఏపి లో గ‌త ఎన్నిక‌ల్లో టిడిపికి వేసిన వారు తిరిగి అదే పార్టీకి ఓటు వేసినా..గ‌తంలో వేసిని ప‌వ‌న్ -బిజెపి మ‌ద్ద‌తు దారులు తిరిగి ఇప్పుడు బిజెపికి వేసే ప‌రిస్థితి లేద‌ని..ప‌వ‌న్ అభిమానులు తిరిగి ప‌వ‌న్ కే ఓటు వేస్తార‌ని..త‌మ ఓటు బ్యాంకు త‌మకే ఉంటుంద‌ని వైసిపి వాదిస్తోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఖ‌చ్చితంగా త‌మ‌కు అద‌న‌పు ఓటు గా వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన సైతం తాము ఈ సారి కీల‌కంగా మార‌తామ‌ని అంచ‌నా వేస్తోంది. ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా తామే కీల‌కంగా మారుతామ‌ని.. ఎవ‌రికి మెజార్టీ రాక‌..త‌మ‌కే అవ‌కాశం ద‌క్కినా ఆశ్య‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. దీంతో..ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీలు అనుస‌రిస్తున్న వ్యూహాలు ఎవ‌రికి మేలు చేస్తాయో...ఎవ‌రిని అధికారానికి ద‌గ్గ‌ర చేస్తాయో చూడాలి..

English summary
In coming elections multi party contest may take place. In that congest who will become King and who will be the king maker is hot topic in AP politics. Congress decided to do not tie up with any party in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X