Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రత్యేక హోదాపై సభలో పోరాటం, చంద్రబాబు టార్గెట్, జగన్ కు కితాబు : మల్టీ టాస్కింగ్ ఎంపీ సాయిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయ సాయి రెడ్డి మల్టీటాస్కింగ్ లో దిట్ట అని వైసీపీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది . ఒకపక్క ఏపీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను సోషల్ మీడియా వేదికగా ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూనే, మరోపక్క ఓ ఎంపీగా ప్రస్తుతం రాజ్యసభ ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించేలా జగన్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలను, తీసుకు వచ్చిన పలు పథకాలను సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

 చంద్రబాబునే కాదు ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి

చంద్రబాబునే కాదు ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సమాధానం చెబుతూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, టీడీపీ నేతలను మాత్రమే కాకుండా జగన్ ప్రభుత్వ తీరును ప్రశ్నించే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ అందుకు సమాధానంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. చంద్రబాబు ఆస్తులను టార్గెట్ చేశారు.

 చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులకు హెరిటేజ్ ను తాకట్టు పెట్టాడా ?

చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులకు హెరిటేజ్ ను తాకట్టు పెట్టాడా ?

41 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలలో అకౌంటింగ్ ప్రజలలో తప్పిదాలు జరిగాయని,ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ని టార్గెట్ చేస్తున్న వేళ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం కరోనా కష్టకాలంలో కొద్దోగొప్పో అప్పు చేస్తే జగన్ గారి ఆస్తులను తాకట్టు పెట్టలేదంటూ పచ్చ మీడియా గోల చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ అప్పులు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులకు హెరిటేజ్ ను తాకట్టు పెట్టాడా ? హైదరాబాదులోని ఇంద్రభవనాన్నో ? కాల్ సెంటర్స్ నడుపుకుంటున్న పార్టీ ఆఫీసునో తాకట్టు పెట్టాడా అంటూ ప్రశ్నించారు.

 కరోనా సమయంలో ఒక్క పైసా కూడా విదల్చని బాబు కోవర్టు ఆపరేషన్ల కోసం కోట్లు

కరోనా సమయంలో ఒక్క పైసా కూడా విదల్చని బాబు కోవర్టు ఆపరేషన్ల కోసం కోట్లు

కరోనాతో రాష్ట్రం విలవిలలాడుతుంటే 100 కోట్లు ఇవ్వగలిగినా ఒక్క పైసా కూడా విదల్చని బాబు కోవర్టు ఆపరేషన్ల కోసం కోట్లు వెదజల్లుతున్నాడు అని మండిపడ్డారు. ప్రజల్లో జీరో అయ్యాక గెలుపుపై నమ్మకం పోయిందని జగన్ గారిని చిరాకు పెట్టడం, అడ్డదారుల్లో పాలనకు ఆటంకం కలిగించడమే అజెండాగా చంద్రబాబు తీరు ఉందని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశారు.

రాజ్య సభలో ప్రత్యేక హోదా అంశంపై చర్చకు కేంద్రంపై వార్ చేస్తూనే ప్రతిపక్షాలను టార్గెట్

రాజ్య సభలో ప్రత్యేక హోదా అంశంపై చర్చకు కేంద్రంపై వార్ చేస్తూనే ప్రతిపక్షాలను టార్గెట్

ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలలో పాల్గొంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు కూడా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ ఇచ్చిన నోటీసును చైర్మన్ తిరస్కరించడంతో ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసన తెలియ చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకపక్క ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిపక్ష విమర్శలకు సమాధానం చెపుతూనే, మరోపక్క ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Recommended Video

    వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన ఆ రోజే.. కీలక సన్నివేశాలకు వేదిక కానున్న ఇడుపులపాయ!! || Oneindia Telugu
    ఏపీలో జగన్ సర్కార్ పని తీరు తెలిసేలా పోస్టులతో సాయిరెడ్డి

    ఏపీలో జగన్ సర్కార్ పని తీరు తెలిసేలా పోస్టులతో సాయిరెడ్డి

    అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలపై కూడా సోషల్ మీడియా వేదికగా అవగాహన తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు .ఉపాధి అవకాశాలు కల్పించే పెద్ద కంపెనీలకు పెద్దపీట వేసే విధంగా వైయస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఐటీ పాలసీ 2021 24న విడుదల చేసిందని ఈ ఐటి పోలీసుల మహిళలు, బిసి, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటుచేసే ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టిందని విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. సొంతంగా ఐటి ప్రాజెక్టులు చేసుకునే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని, ఉద్యోగ కల్పన ఆధారంగానే ఐటీ సంస్థలకు భూకేటాయింపులు చేస్తున్నామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. ఏకకాలంలో ఎంపీ సాయిరెడ్డి ఇన్ని పనులు చేస్తూ పార్టీలో కీలకంగా మారారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+