మల్టీ టాలెంటెడ్ బ్రహ్మానందం: మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర పోస్ట్!!

బ్రహ్మానందం.. గొప్ప కమెడియన్ మాత్రమే కాదు.. ఆయన ఒక గొప్ప రచయిత కూడా. తాజాగా అదే విషయాన్ని ఆయన నిరూపించుకున్నారు. సినిమాలలోకి రాకముందు బ్రహ్మానందం తెలుగు అధ్యాపకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

చంటబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన హాస్య నటుడిగా వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల కాస్త సినిమాలు తగ్గించిన బ్రహ్మానందం, తనలో ఉన్న రచన నైపుణ్యాన్ని వెలికి తీశారు.

Multitalented Brahmanandam: Megastar Chiranjeevi Interesting Post!!

అంతకుముందు కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయంలో దేవుడు చిత్రాలను తన చేతులతో స్వయంగా గీసిన బ్రహ్మానందం వాటిని పలువురు హీరోలకు బహుమతిగా అందించారు. ఇక ఇప్పుడు ఏకంగా బ్రహ్మీ తన జీవితాన్ని నేను అన్న టైటిల్ తో పుస్తకంగా రాసి తనలోని రచయితను పరిచయం చేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం అంటూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పి తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకందించటం ఎంతో ఆనందదాయకం అంటూ పేర్కొన్నారు.

బ్రహ్మానందం రాసిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదివి తీరాల్సిందేనని పేర్కొన్న చిరంజీవి తానే చెప్పినట్టు 'ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని తాను నమ్ముతున్నానని వెల్లడించారు.

ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన 'అన్వీక్షికి' వారిని అభినందిస్తున్నాను అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చిరంజీవి, తన సతీమణి సురేఖతోనూ కలిసి బ్రహ్మానందం దిగిన ఫోటోలను, ఆయన పుస్తకాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+