వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5కోట్లమంది కోసం 'కోటి' ప్రాణత్యాగం: బాధగా చిరు, బాబుకి పెద్ద చిక్కే

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ వ్యాప్తంగా మంగళవారం బంద్‌ కొనసాగుతోంది. సీపీఐ ఇచ్చిన బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌, వైసిపి మద్దతు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్‌ బంక్‌లు, విద్యా వాణిజ్య సంస్థలు మూసివేశారు.

పలుచోట్ల బస్టాండ్‌ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్‌కు లారీ యజమానుల సంఘం కూడా మద్దతు తెలిపింది. ముని కోటి ఆత్మహత్య ఘటనపై సోమవారం బంద్‌ పాటించినందున తిరుపతిలో బంద్‌కు మినియింపునిచ్చారు.

చిత్తూరు జిల్లాలో మాత్రం బంద్‌ కొనసాగుతోంది. తిరుపతి ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో పాక్షికంగా కొనసాగుతుంది. తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. పోలీసుల ఆదేశాల మేరకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం తెలిపారు.

మంగళవారం రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. సిపిఐ ఇచ్చిన ఈ బందుకు విపక్షాలు అన్నీ మద్దతు పలుకుతున్నాయి. మునికోటి మృతి అనంతరం హోదా ఉద్యమం రాజుకుంది. ఇది చంద్రబాబుకు కొత్తగా వచ్చిన పెద్ద చిక్కు అని చెప్పవచ్చు.

మునికోటి అంత్యక్రియలు

మునికోటి అంత్యక్రియలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి సోమవారం తిరుపతిలో బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం మునికోటి అంత్యక్రియలు జరిగాయి.

మునికోటి

మునికోటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మునికోటి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళవారం పలువురు నాయకులు నివాళులర్పించారు.

బంద్

బంద్

హోదా సాధన సమితి పేరిట సిపిఐ మంగళవారం రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు, వైసిపి, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించాయి.

బంద్

బంద్

వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎన్‌ఎస్‌యుఐ, పిడిఎస్‌యు, ఇతర విద్యార్థి సంఘాలన్నీ ఇప్పటికే విద్యాసంస్థల చుట్టూ తిరిగి బంద్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తా, సమైక్యాంధ్ర, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు సైతం బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

చిరంజీవి

చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి మృతదేహం వద్ద చంద్రబాబు నివాళులు.

మునికోటి

మునికోటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మునికోటి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళవారం పలువురు నాయకులు నివాళులర్పించారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మాహుతికి పాల్పడటంతో బంద్‌ను విపక్షాలు మరింత సీరియస్‌గా తీసుకున్నాయి. దీనిలో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఈ నెల 1న ఉత్తరాంధ్ర నుంచి చేపట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా అనూహ్య రీతిలో స్పందన లభించింది.

మునికోటి

మునికోటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగానికి పాల్పడిన మునికోటికి సంతాపం ప్రకటిస్తున్న కాంగ్రెస్ నాయకులు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధనకై ఆగస్టు 11న రాష్ట్ర బందును విజయవంతం చేయాలని హోదా సాధన సమితి ప్రచారం.

English summary
Saturday's self immolation of Muni Kama Koti in Tirupati for special status to Andhra Pradesh sparked widespread public ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X