'నా భార్య పట్ల అనైతికంగా', నల్గొండలో ఐదుగురు మృతి

 Municipal Chairman Hungama in a hotel
చిత్తూరు: ఓ హోటల్‌ను ఖాళీ చేయాలని శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ హంగామా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. శరవణ భవన్ అనే హోటల్‌ను ఖాళీ చేయాలని ఆ హోటల్ యజమాని మనోహరన్ పైన దౌర్జన్యం చేశాడని ఆరోపిస్తున్నారు. మనోహరన్ పైన పలుమార్లు దాడికి ప్రయత్నించారంటున్నారు.

యజమాని మనోహరన్ పైన దాడి చేయడమే కాకుండా.. హోటల్ మేనేజర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అంటున్నారు. హోటల్ మేనేజర్ మహిళ. ఆమె పట్ల అనైతికంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

మున్సిపల్ చైర్మన్ తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించాలని హోటల్ యజమాని మనోహర్ ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ హోటల్‌ను ఆయన లాక్కోవాలని చూస్తున్నారని, వాస్తవానికి తమకు 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, అనుచరులతో పదేపదే దాడులు చేయిస్తున్నారని వాపోయారు. మహిళ అని చూడకుండా అనైతికంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు.

మట్టి పెళ్లలు విరిగిపడి ఐదుగురు మృతి

నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం వజినేపల్లిలోని పులిచింతల ప్రాజెక్టు పవర్ హౌస్ వద్ద మట్టి దిబ్బ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గోవింద్, గోపాల కృష్ణ , సలీం, సుబ్బు, నందుగా గుర్తించారు. గోపాల కృష్ణ సబ్ కాంట్రాక్టర్. మిగిలిన నలుగురు కూలీలు. కూలీల్లో ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+