జనసేన స్థానాలు ఇవే, బీజేపీకి ఫిక్స్ - కూటమిలో సీట్ల సర్దుబాటు ఇలా..!!
స్థానిక ఎన్నికలకు ఈ రోజు షెడ్యూల్ విడుదల కానుంది. కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు పైన స్పష్టత వస్తోంది. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు పార్టీల నడుమ జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమై స్థూలంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ రోజు (బుధవారం) మూడు పార్టీలు తాము పోటీ చేసే స్థానాల పైన ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. కాగా.. మూడు పార్టీలు తమ అభ్యర్ధుల విషయంలో తుది కసరత్తు చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఈ రోజు ఫైనల్ కానుంది. ఇప్పటికే మూడు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. జనసేనకు కేటాయించాల్సిన మరో మేయర్ స్థానం పైన చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 17 కార్పొరేషన్లలో 6, మున్సిపాలిటీ లు - నగర పంచాయతీల్లో 26 ఇవ్వాలని జనసేన ప్రతిపాదించింది. విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నంలలో 6 తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే వీటిలో 4 కార్పొరేషన్లను, 24 వరకు మున్సిపాలిటీలు ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసింది. జనసేన మాత్రం ఆరు స్థానాల కోసం పట్టబడుతోంది. దీంతో, అయిదు స్థానాలు చివరగా ఖరారయ్యే ఛాన్స్ ఉందని పార్టీ నేతల సమాచారం.

నేడు తుది చర్చలు.. ప్రకటన
జనసేనకు మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలు స్థానాలివ్వాలని టీడీపీ భావిస్తోంది. అయితే మచిలీపట్నం బదు లు గుంటూ రు, ఏలూరుల్లో ఒకటి ఇవ్వాలని జనసేన అడిగినట్లు తెలుస్తోంది. బీజేపీ రాయలసీమ నుంచి ఓ కార్పొరేషన్ బరిలో నిలిచే అవకాశం ఉంది. బుధవారం ఉదయం జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటుపై సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేన కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతలు పవన్ తో చర్చించారు. తమిళనాడు సీఎం విజయ్ పర్యటన పూర్తయిన తరువాత మరోసారి కూటమి నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఒక అంచనా కు వచ్చారు. ఈ రోజు తుది చర్చల తరువాత అధికారికంగా సీట్ల ఖరారు పైన ప్రకటన రానుంది.













Click it and Unblock the Notifications
