స్థానిక సమరానికి సై, షెడ్యూల్ - ఏ ఎన్నిక ఎప్పుడు.. ఫలితాలు ఇలా..!!
ఏపీలో ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్తోపాటు మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీంతో ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. మున్సిపాల్టీలతో పాటుగా పంచాయితీలు, పరిషత్ లకు ఎన్నికల షెడ్యూల్ ఒకే విడుదల చేయనున్నారు.
ఏపీలో స్థానిక సమరానికి నేడు షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్రం మొత్తం ఎన్నికల వేడి మొదలు అవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికల సంఘం ఈ రోజు ముందుగా పంచాయతీలు, పరిషత్లు, మున్సిపాలిటీలు-కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్లకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలు, వాటిలోని వార్డులు ఈ జాబితాలో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ రెండో దశలో 28 జిల్లా పరిషత్లు, 659 జడ్పీటీసీలు, ఎంపీపీలు... 9848 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 18, 19 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది. చివరగా 13,185 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 1.32 లక్షల వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

నేటి నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్
కాగా.. పండగల నేపథ్యంలో కొంత సమయం తీసుకుని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించా లని భావిస్తున్నారు. వచ్చేనెల 13న లేదా 16న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం. ఇక.. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో పూర్తి కానున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికలు మూడు దశల్లో డిసెంబరు 2 నుంచి 14 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ రోజు వెలువడే షెడ్యూల్లో ఈ తేదీలపై పూర్తి స్పష్టత రానుంది. నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులను మాత్రం... ఎన్నికల్లో నెగ్గిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకుంటారు. ఈ నెల చివరి నాలుగు రోజుల్లో పోలింగ్.. ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో.. ఇక, రాజకీయం గా సందడి మొదలు కానుంది.













Click it and Unblock the Notifications
