‘వెంకన్న చౌదరి’ పొరపాటే: శ్రీవారికి మురళీమోహన్ క్షమాపణలు
తిరుపతి: గతంలో తాను ఓ సందర్భంలో తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకన్నస్వామి అనబోయి పొరపాటున వెంకన్న చౌదరి అన్నానని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల వెంకన్నను మన్నించాలని వేడుకున్నట్లు తెలిపారు.
శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దేవుడికి కులాన్ని అంటగట్టే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులంతా తనను క్షమించాలని ఎంపీ మురళీమోహన్ కోరారు.

ఆ తర్వాత వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ నాటకమని, రాజీనామాలు చేసిన 75 రోజుల తర్వాత ఆమోదించడం ఓ రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఉప ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని మురళీ మోహన్ ఆరోపించారు.
కాగా, మురళీ మోహన్ వెంకన్న చౌదరి అని గతంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. టీడీపీ వాళ్లు దేవుడికి కులం అంటగడుతున్నారని జీవీఎల్ విమర్శించారు.












Click it and Unblock the Notifications