వివాహేతర బంధం?: బ్యూటీషియన్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తులతో దాడి చేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్‌పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఆమె చేతులను నరికేశారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని పద్మగా పోలీసులు గుర్తించారు.

అయితే, బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. ప్రసాద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ యువకుడితోనే బాపుల పాడులో నివాసముంటోంది.
ఈ క్రమంలోనే ఆమెపై హత్యాయత్నం జరగడంతో.. యువకుడితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని బంధువులతోపాటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే దాడి చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications