భర్తను చంపిన భార్య: పిల్లల సాక్ష్యంతో ఆమెకూ, ప్రియుడికీ జైలు
అనంతపురం: కన్నపిల్లలు సాక్ష్యం చెప్పడంతో ఓ మహిళకు, ఆమె ప్రియుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. భర్తను చంపిన కేసులో ఆమెకూ, ఆమె ప్రియుడికి అనంతపురం జిల్లా హిందూపురం అదనపు న్యాయమూర్తి డి. రాములు శుక్రవారంనాడు తీర్పు చెప్పారు.
అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో పి.నాగప్ప(45) భార్య లింగమ్మ(43) దంపతులు జీవనం సాగిస్తూ వచ్చారు. అయితే అదే గ్రామానికి చెందిన చౌడప్ప(34)తో లింగమ్మకు వివాహేతర సంబంధం ఉండేది.

తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో నాగప్పను తొలగించుకోవాలని లింగమ్మ, ఆమె ప్రియుడు చౌడప్ప పథకం రూపొందించారు. దాని ప్రకారం 2014 సెప్టెంబర్ 14న రాత్రి వారిద్దరూ కలిసి నాగప్ప గొంతు నులిమి చంపారు. ఈ సంఘటనపై ఆమె కుమారుడు నర్సింహమూర్తి మరుసటిరోజు లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకుని అప్పటి సిఐ శివనారాయణ స్వామి దర్యాప్తు చేపట్టారు.
మృతుడి భార్య లింగమ్మ, చౌడప్పను అరెస్ట్‌చేసి ఆయన రిమాండుకు పంపారు. కేసు విచారణలో 15మంది సాక్షులను విచారించారు. తమ తండ్రిని హత్యచేసింది తమ తల్లి, ఆమె ప్రియుడేనంటూ కన్నకొడుకు నర్సింహమూర్తి (23), కుమార్తె సౌందర్య(20)లు సాక్ష్యం చెప్పడంతో అదనపు జడ్జి యావజ్జీవ శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో రెండేళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications