వణికిస్తున్న తీవ్ర తుపాను మురసు, కుండపోత - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో, తీర ప్రాంత జిల్లాల కు భారీ వర్షాల పైన తాజా అలర్ట్స్ జారీ అయ్యాయి.

మురసు తుఫాను తీర ప్రాంత జిల్లాలను వణికిస్తోంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తుపాను నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్లు, కావలికి 180 కిలోమీటర్లు, ఒంగోలుకు 210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆర్టీజీఎస్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

విజయవాడ మేయర్, రెండో స్థానం తేల్చేసిన పోలింగ్- లెక్క మార్చిన సైలెంట్ ఓటింగ్..!?
విజయవాడ మేయర్, రెండో స్థానం తేల్చేసిన పోలింగ్- లెక్క మార్చిన సైలెంట్ ఓటింగ్..!?
murusu-cyclone-intensifies-into-severe-storm-in-bay-of-bengal-coastal-districts-on-high-alert

అధికార యంత్రాంగం అప్రమత్తం

తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 100 నుంచి 110 కిమీ వ‌ర‌కు గ‌రిష్టంగా 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకటి,రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. ఏలూరు, తూగో, పగో, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదే విధంగా అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ తో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. సహాయక చర్యలు కోసం ముందస్తుగా 6 NDRF, 7 SDRF బృందాలను రంగం లోకి దించినట్లు తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+