బతికించండి సార్.. పోలీసులను వేడుకున్న రాప్తాడు కేసు నిందితుడు.. వీడియో వైరల్!

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటనలో నిందితుడు హేమంత్ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడిన హేమంత్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దండం పెడతా.. బతికించండి సార్.. రికవరీ చేయించండి అంటూ పోలీసులను వేడుకున్నాడు.

శనివారం ఉదయం రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన హేమంత్, ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారైయ్యాడు. తరగతి గదిలోకి చొరబడి చెట్లు నరికే రంపం యంత్రంతో బాలిక ముఖం, తల, వీపు భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళన కలిగించింది. బాధిత బాలికను ముందుగా అనంతపురం ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు.

Rapthadu Case Accused Hemanth Begs Police to Save Him After Being Shot While Resisting Arrest

ఆమె ప్రస్తుతం కొన ఊపిరితో పోరాటం చేస్తోంది.నిందితుడు హేమంత్ బాలికకు దూరపు బంధువు అని, ఆమెపై ప్రేమ ప్రతిపాదనలు చేసి తిరస్కరించబడిన తర్వాత ఈ దాడి చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. దాడి తర్వాత పరారైన అతడిని పట్టుకోవడానికి పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు అడవుల్లో హేమంత్ ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

పోలీసులు చేరుకోగానే హేమంత్ మద్యం మత్తులో ఉండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కత్తి పట్టుకుని రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లుపై దాడికి దిగాడు. సీఐకి చేతిలో తీవ్ర గాయం కాగా, పోలీసులు ముందుగా గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినా అతడు వెనక్కి తగ్గకుండా మళ్లీ దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు కాళ్ల భాగాల్లో తగిలి హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతపురం ఎస్పీ జగదీష్ ఈ వివరాలను వెల్లడిస్తూ, నిందితుడు పోలీసులపై దాడి చేసినందునే కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. గాయపడిన హేమంత్‌ను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు పోలీసులను చేతులు జోడించి బ్రతిమలాడుతున్న వీడియో వైరల్ అయింది. ఈ కాల్పుల వార్త విన్న రాప్తాడు, అయ్యవారిపల్లి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

మోదీ గద్దె దిగక తప్పదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ర్యాలీలో ఘాటువ్యాఖ్యలు!
మోదీ గద్దె దిగక తప్పదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ర్యాలీలో ఘాటువ్యాఖ్యలు!

గ్రామస్థులు టపాసులు కాల్చి, పోలీస్ జిందాబాద్ నినాదాలు చేశారు. బాలికపై జరిగిన దారుణానికి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బాధిత బాలిక త్వరగా కోలుకోవాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+