విజయవాడ మేయర్, రెండో స్థానం తేల్చేసిన పోలింగ్- లెక్క మార్చిన సైలెంట్ ఓటింగ్..!?

ఏపీలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. విజయవాడ మేయర్ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. జనసేన- వైసీపీతో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పోటీ చేయటంతో కొత్త టర్న్ తీసుకుంది. అనేక అంచనాలు.. చర్చ లు.. విశ్లేషణలు పోలింగ్ వరకు వినిపించాయి. అయితే, పోలింగ్ సరళి పూర్తి స్పష్టత ఇచ్చింది. కొత్త మేయర్ ఎవరో తేల్చేసింది. రెండో స్థానం పైనా క్లారిటీ వస్తోంది.

విజయవాడ మేయర్ బరిలో ప్రధానంగా ముగ్గురు మధ్య త్రిముఖ పోరు కనిపించింది. కూటమి నుంచి జనసేన అభ్యర్దిగా వంగవీటి రాధా.. వైసీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మీ... వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వర రావు పోటీ చేసారు. ఈ ముగ్గురు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. విజయవాడ సామాజిక - రాజకీయ సమీకరణాలతో ఏబీవీ పోటీ మరింత ఉత్కంఠ పెంచింది.

12 గంటల్లోనే స్థానిక ఎన్నికల ఫలితాలు- పోలింగ్, కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
12 గంటల్లోనే స్థానిక ఎన్నికల ఫలితాలు- పోలింగ్, కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
Vijayawada Mayor Election High Stakes Battle Ends Results Trigger Political Suspense

అయితే.. 54.74 శాతం ఓటింగ్ మాత్రమే విజయవాడలో నమోదు అయింది. గత 2021 పురపాలక ఎన్నికలతో (62.87 శాతం ఓటింగ్) పోల్చితే, ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. అక్కడే త్రిముఖ పోరులో లెక్క మారింది. కూటమికి చెందిన మూడు పార్టీల మద్దతు దారులు.. వైసీపీ అభిమానులు ఆ పార్టీలకు మద్దతుగా నిలిచినా.. తటస్థులతో పాటుగా ఆ రెండు పార్టీల్లో కొన్ని వర్గాలు ఏబీ వైపు నిలుస్తారనే విశ్లేషణలు వినిపించాయి.

అయితే, పోలింగ్ సమయంలో మాత్రం ఓటరు పల్స్ కొన్ని చోట్ల అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన పార్టీల సంప్రదాయ ఓట్ బ్యాంకు లోనూ కొన్ని చోట్ల మేయర్ విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు చోట్ల ఒకే అభ్యర్ధికి మెజార్టీ ఖాయమని.. మరో స్థానంలో మాత్రం హోరా హోరీగా పోలింగ్ జరిగిందనే తాజా విశ్లేషణలు ఆసక్తిగా మారుతున్నాయి.

విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!
విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!

ఏబీ వెంకటేశ్వర రావుకు పోలైన ఓట్ల పైన కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. అయితే, తమ అభ్యర్ధి గెలుపు ఖాయమని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. మెజార్టీ పైన లెక్కలు వేస్తున్నారు. అయితే.. తూర్పు, సెంట్రల్ లో కొంత సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు ప్రధాన పార్టీల ముఖ్యులు చెబుతున్నారు. వీరి ఓటు ఇప్పుడు ఫలితంలో రెండో స్థానం ఖరారులో కీలకంగా మారుతోంది. దీంతో.. రేపు (మంగళవారం) వెల్లడి కానున్న ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+