బాలీవుడ్ దిగ్గజాల పరిస్థితి ఇదీ..: బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ లో సూపర్ స్టార్

బాలీవుడ్ పై ఇటీవలే పంజా విసిరే ప్రయత్నం చేసింది.. మాఫియా. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి కారులో బయటకు వస్తున్న సమయంలో ఎనిమిది రౌండ్ల పాటు కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన డ్రైవర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

గతంలో సల్మాన్ ఖాన్ ఇంటిపైనా కాల్పులు జరిగిన ఉదంతం తెలిసిందే. ఈ కాల్పుల అనంతరం బాలీవుడ్ దిగ్గజ నటులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. కాల్పులు జరిగితే సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్లను వినియోగిస్తోన్నారు. అదనపు భద్రత చర్యల కింద వీటిని అందుబాటులో ఉంచుకుంటోన్నారు. అభిమానులను పలకరించడానికి బయటికి వచ్చే సమయంలో వీటిని వాడుతున్నారు.

Amitabh Bachchan Greets fans outside his Mumbai residence Jalsa from within a bulletproof enclosure

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఇలాంటి ఎన్ క్లోజర్ లో కనిపించారు. తనను చూడటానికి ఆదివారం సాయంత్రం ముంబై జుహూ ప్రాంతంలోని జల్సా బంగళాకు వచ్చిన వందలాది మంది అభిమానులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ నుంచే చిరునవ్వుతూ వారికి అభివాదం చేశారు. ఆ సమయంలో నడుం వరకు కవర్ చేసేలా ఓ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించారు.

ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే
ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే

అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. అభిషేక్.. ప్రతి ఒక్కరిని నిశితంగా గమనించడం కనిపించింది. జల్లా బంగళాను పేల్చివేస్తామంటూ ఇమెయిల్ అందిన నేపథ్యంలో అదనపు ముందుజాగ్రత్తలను తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరపడం, అంతకుముందు సల్మాన్ ఖాన్ ఇంటిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించడం, బంగళా పేల్చేస్తామంటూ బచ్చన్ కుటుంబానికి ఇమెయిల్ రావడం వంటి వరుస ఘటనలు బాలీవుడ్ లో చోటు చేసుకుంటోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+