మోదీ గద్దె దిగక తప్పదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ర్యాలీలో ఘాటువ్యాఖ్యలు!

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన 'ఓట్ బచావో-దేశ్ బచావో' ర్యాలీకి ముందు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటున్న దీక్షతో నరేంద్ర మోదీ గద్దె కూలక తప్పదు. ఆయన గుజరాత్‌కు వెళ్లక తప్పదు అన్నారు.

రాష్ట్రం నుంచి 15 వేల మందిని ఢిల్లీకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించారని, కానీ రైల్వే శాఖ చివరి నిమిషం వరకు రైళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందని సీఎం విమర్శించారు. రైళ్లను ఆపగలిగారు కానీ తెలంగాణ నుంచి వచ్చి ఢిల్లీలో కదం తొక్కిన వేల మందిని ఆపగలిగారా? ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లు మన సంకల్పాన్ని అడ్డుకోగలిగారా? అంటూ ప్రశ్నించారు.

Revanth Reddy Delhi speech Telangana CM Revanth Reddy Declares at Delhi Rally Modi Must Step Down from Power

తెలంగాణ బలం, గళం ముందు వారు తలవంచక తప్పలేదు అని ఆయన అన్నారు.రాముడికి తోడుగా వానర సైన్యం లంకపై కదం తొక్కినట్లే తెలంగాణ సైన్యం రావణుడైన నరేంద్ర మోదీని ఓడించడానికి ఢిల్లీకి వచ్చిందని సీఎం ఉపమానం ఇచ్చారు. ఇక విజయం సాధించేవరకు విశ్రమించబోము అని ఆయన ఘాటుగా చెప్పారు. నవంబర్ 2న హైదరాబాద్‌కు రాబోయే అమిత్ షాకు గుండెలు అదిరేలా నినాదాలు వినిపించాలని కార్యకర్తలను కోరారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోందని సీఎం గుర్తు చేశారు. బ్రిటిషర్లపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషితో పీడిత, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, యువతకు ఓటు హక్కు కల్పించిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష పేరుతో 'విభజించు-పాలించు' విధానం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు తొలగింపు, ఆడపడుచులు, ఆదివాసీలు, గిరిజనుల ఓటు హక్కు తీసేయాలని కుట్ర చేశారని, కానీ ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం అన్నారు. అప్పటి నుంచి దళితులు, ఆదివాసీలు, ఆడపడుచులపై కక్ష పెంచుకున్న మోదీ, జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించి ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని, ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లు తొలగించారన్నారు.

రాబోయే రోజుల్లో ఓట్ల తొలగింపు 20 కోట్లకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో 15-20 శాతం ఓట్లు తొలగించి భాజపా మళ్లీ అధికారంలోకి రావాలన్న కుతంత్రం పన్నిందని, దీన్ని అడ్డుకోవడానికే రాహుల్ గాంధీ ఏడాదిగా చేస్తున్న పోరాటం చివరి అంకానికి చేరుకుందని సీఎం చెప్పారు. మీరంతా తెలంగాణ బలం కనిపించేలా చేయాలి. ప్రారంభం నుంచి చివరి వరకు సభలో కూర్చొని సందేశాన్ని తీసుకొని మన గ్రామాలకు వెళ్లాలి" అని కార్యకర్తలను ఆదేశించారు.

తెలంగాణాలో క్రాప్ హాలిడేపై మంత్రి కీలక ప్రకటన!
తెలంగాణాలో క్రాప్ హాలిడేపై మంత్రి కీలక ప్రకటన!

మేధావులు, ప్రొఫెసర్లు కూడా ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదంపై నిరసన తెలపడానికి వచ్చారని, ప్రొఫెసర్ కోదండరాంను ప్రశంసించారు. ఈ ర్యాలీ కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు రక్షణ కోసం అందరూ ఏకమవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటాన్ని గ్రామాల స్థాయి వరకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+