చంద్రబాబుతో కెసిఆర్ సన్నిహితుడు మైహోం రామేశ్వర రావు ముచ్చట్లు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి కుమారుడి వివాహంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మైహోం రామేశ్వర రావు మాట కలిపారు.
రావుల తనయుడి వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. నూతన వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించారు.

ఈ వివాహానికి టిడిపికి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు, బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సన్నిహితుడిగా పేరుపడ్డ మైహోం గ్రూప్ రామేశ్వర రావు కూడా హాజరయ్యారు.
చంద్రబాబు, రామేశ్వర రావులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. పెళ్లి కారణంగా వీరు కలిశారు. మరోవైపు, ఈ వేడుకకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications