గుప్త నిధుల కోసమని వచ్చి అన్నాచెల్లెళ్ల మృతి

ఓ వ్యక్తికి చెందిన పొలంలో గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో గత కొద్ది రోజులుగా చాలామంది తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యలో హైదరాబాద్‌కు చెందిన రాధాకృష్ణ పాలమూరుకు చెందిన అన్నాచెల్లెళ్లు నాగరాజు, రమాదేవి, మరికొంత మంది సహకారంతో తవ్వకాలు జరిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
గురువారం తెల్లవారుజామున వీరంతా కలిసి ప్రొక్లెయిన్ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా పక్క పొలాల్లో నిద్రిస్తున్న రైతులు గమనించి కేకలు వేస్తూ పరుగున వచ్చారు. ఇది గమనించిన మిగతా వారు పారిపోగా అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ప్రొక్లైన్ పైకి చేరుకుని వేగంగా నడపడంతో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే గుప్త నిధుల కోసం ఎవరైనా చంపారా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications