మేం చెప్పిందే నిజమైంది ! జగన్ స్పందించరా ? సీఎంవో డేటా బ్రీచ్ పై నాదెండ్ల మనోహర్...

ఏపీలో వాలంటీర్ల వ్యవస్ధపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వరుస విమర్శలు చేశారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పాలనా కేంద్రమైన సచివాలయంలో, అదీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే డేటా ఉల్లంఘన జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. గతంలో తాము చెప్పిందే నిజమైందన్నారు.

వైసీపీ వ్యతిరేక ఏపీ కోసం జనసేన క్యాడర్ పనిచేస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి పవన్ నియోజకవర్గాల్లో సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వాలంటీర్ల వ్యవస్ధ, వ్యక్తిగత డేటా అపహరణపై పవన్ మాట్లాడితే ఉలిక్కిపడి కేసులు పెట్టించారని నాదెండ్ల తెలిపారు. ఇంట్లో ఎన్ని ఏసీలు, ఫ్రిజ్ లు ఉన్నాయి, ఆధార్ కార్డు, బైక్ ల నంబర్లు ఎందుకన్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో సంస్ధకుకాంట్రాక్టు ఇచ్చి కార్పోరేషన్, మున్సిపాలిటీలకు సమాంతర వ్యవస్ధ ఏర్పాటు చేశారని విమర్శించారు.

nadendla manohar

అలాగే తాజాగా ఏపీ సీఎం పేషీలో జరిగిన తతంగంపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. ఇదే సమస్యపై పవన్ గతంలో ప్రస్తావించారని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఈ ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల పేరుతో సీఎంకు తెలియకుండా వందల ఫైళ్లు సంతకాలు అయి వెళ్లిపోవడం తప్పుకాదా అని మనోహర్ అడిగారు. అలాగే వాలంటీర్ తప్పు చేస్తే ఎవరిని అడగాలి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. గతంలో మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా ఆర్ధికశాఖలో నలుగురు ఉద్యోగుల్ని తప్పించారు. ఇప్పుడు సీఎం ఆఫీసులో 225 ఫైల్స్ అక్రమంగా సంతకాలు జరిగాయని ఆరోపించారు.

nadendla manohar

ఇదంతా చూస్తుంటే పారదర్శకత ఎక్కడ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని నాదెండ్ల తెలిపారు. కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. మీరు, మీకుటుంబం, చుట్టూ ఉన్న పది మందికే రాష్ట్ర, ఆర్ధిక వ్యవస్ధ పరిమితమైపోతే ఎలా అని జగన్ ను ఆయన ప్రశ్నించారు. ఏ సీఎంవోలో కూడా తన పేషీలో అవకతవకలు జరిగాయి, డబ్బులు మారుతున్నాయనే విమర్శలు రాలేదా అని అడిగారు. ఎవరి ఆదేశాలతో ఇది జరుగుతోంది, దీనిపై సమగ్ర విచారణ జరిపించి సమాంతర వ్యవస్ధను అరికట్టాలన్నారు.

మంత్రులకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని నాదెండ్ల తెలిపారు. దీంతో మంత్రులు పవన్ పై ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. క్షేత్రస్ధాయిలో జనసేన ఫోకస్ పెట్టిందని తెలిపారు. సీఎంవోలో అక్రమాలు జరిగాయని సీఎం ఒప్పుకుని చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+