నాగబాబుకు ప్రమోషన్, కొత్త హోదా - ఉత్తర్వులు జారీ...!!
మెగా ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం లో ప్రాధాన్యత పెరుగుతోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక వేళ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా నామినేటెడ్ పదవి అప్పగించారు. ఇప్పుడు ప్రమోషన్ కల్పించారు. తాజాగా చిరంజీవి కుమార్తు సుస్మిత కు పదవి ప్రకటించారు. నాగబాబుకు తాజాగా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభుత్వంలో కీలక హోదా దక్కింది. నాగబాబు కు మంత్రి పదవి ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇక, కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ ఖాయమని ప్రచారం సాగింది. అయితే, ఇప్పటి వరకు మంత్రి పదవి ఊసే లేదు. ఈ సమయంలోనే నాగబాబుకు కీలక పదవి కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో కూటమి ఏర్పాటు నుంచి నాగబాబుకు పదవుల విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో తొలుత అనకాపల్లి నుంచి నాగబాబును బరిలో కి దించాలని భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. బీజేపీ ఆ సీటు కోరటం తో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ దక్కింది. అయితే..ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో.. నాగబాబుకు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మెగా ఫ్యామిలీకి పెరుగుతున్న ప్రాధాన్యత
మంత్రి అవుతారని భావించిన నాగబాబుకు 'గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ' చైర్మన్‌గా బాధ్యతలు కేటాయించారు. పర్యావరణ, అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది. నాగబాబు ఈ పదవి ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణ మరియు మొక్కలు నాటే ప్రాజెక్టుల పరిశీలన, పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక నాగబాబు కు మంత్రి పదవి దక్కకపోయినా.. ఇప్పుడు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో.. మంత్రికి దక్కే అన్ని రకాల ప్రయోజనాలు నాగబాబుకు అందనున్నాయి. దీని ద్వారా నాగబాబు మంత్రి హోదా ఉన్నా.. ఇక కేబినెట్ లో మంత్రి అయ్యే అవకాశాలు లేనట్లుగానే కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications
