Maremma Movie Review: రవితేజ తమ్ముని కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఫిట్టా.. ఫట్టా?

Maremma Movie Review: ప్రముఖ హీరో, మాస్ మహారాజా రవితేజ తమ్ముని కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా 'మారెమ్మ'. తమిళ్ హిట్ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్'ఫేమ్ దీపా బాలు హీరోయిన్‌గా అలరించారు. డైరెక్టర్ మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా నేడు(సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ సినిమాను నిర్మించారు. జంతుబలి, ప్రజల్లో నమ్మకాలు, ఆచారాలపై తీసిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?
నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?

స్టోరీ
తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఆ ఊరి ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు, దేవత 'మారెమ్మ' పట్ల వారికి ఉన్న నమ్మకాలను ఇక్కడ చూపించారు. అమ్మవారికి బలి ఇవ్వడం కోసం 'మారెమ్మ' అనే ఓ దున్నపోతును కర్ణి(మాధవ్ భూపతిరాజు) పెంచుతుంటాడు. అయితే పూజ సమయానికి ఆ దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఊరి ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు ఆ దున్నపోతు ఏమైంది. దానిని వెతికే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే మిగతా కథ.

Maremma Movie Review Maadhav Bhupathiraju Rural Drama Review and Rating Full Details Here

ప్లస్ పాయింట్స్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన పాటలు, పాటి చిత్రీకరణ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అరంగేట్ర హీరోగా మాధవ్ భూపతిరాజు తన పాత్రకు న్యాయం చేశారు. నటనపరంగా పరవాలేదనిపించినా, బలహీనమైన స్క్రిప్ట్ ఆయన ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయి మంచి నటనను కనబరిచారు.

మైనస్ పాయింట్స్
డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారనే విషయంలో స్పష్టత కరువైంది. జంతు బలులపై సందేశం ఇవ్వడమే ఉద్దేశమైతే.. అది సినిమాలో సరిగ్గా వ్యక్తమవ్వలేదు. ముఖ్యంగా రెండో భాగం అంతా కనిపించకుండా పోయిన దున్నుపోతు వేట చుట్టూనే తిరుగుతుంది. కానీ స్టోరీ నెమ్మదిగా ఎటువంటి ఉత్కంఠ లేదా భావోద్వేగాలు లేకుండా సాగుతుంది. ఓ సన్నివేశానికి మరో సన్నివేశానికి మధ్య అనుసంధానం లోపించింది. కథానాయకుడికి ఆ జంతువుతో ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. విలన్ ట్రాక్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. క్షుద్రపూజలకు సంబంధించిన సన్నివేశాలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. చాలావరకు సీన్లు ఫ్లాట్ గా, విసుగు తెప్పించేలా ఉండటమే ఈ చిత్రానికి ప్రధాన బలహీనత.

Maremma First Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. పక్కా గూస్ బంప్స్ మూవీ.. మిస్ కావొద్దు..!!
Maremma First Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. పక్కా గూస్ బంప్స్ మూవీ.. మిస్ కావొద్దు..!!

సాంకేతిక వర్గం
ప్రశాంత్ ఆర్ విహారి, ప్రదీప్ దత్తా అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. ఎడిటింగ్ పరంగా ఇంకా శ్రద్ధ వహించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదనిపిస్తాయి. అయితే దర్శకుడు మంచాల నాగరాజు స్టోరీపై చూపించిన అశ్రద్ధ సినిమాను తీవ్రంగా దెబ్బతీసింది.

ఫైనల్‌గా..
మారెమ్మ సినిమా స్పష్టమైన విజన్ లేని నీరసమైన రూరల్ డ్రామా. హీరోగా మాధవ్ భూపతిరాజు పర్వాలేదనిపించినప్పటికీ.. బలహీనమైన స్టోరీ, రొటీన్ సీన్ల వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

రేటింగ్: 2/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+