లక్షల కోట్ల ఆస్తులున్న పేదవాడు జగన్.. అందుకే పెత్తందార్లతో యుద్ధం: నాగబాబు సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు ఏపీలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంటే, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్ళే ప్లాన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలో దూసుకు వెళుతున్నారు.
తాను అందిస్తున్న సంక్షేమ పథకాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి టిక్కెట్లు కేటాయింపు విషయంలోను సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లను కేటాయిస్తున్నారు. ఇక సిద్ధం సభలతో మోత పుట్టిస్తున్న జగన్ ఈ ఎన్నికలు పేదోడికి పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధంగా చెప్తూ, పేదల పక్షాన తాను పోరాటం చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. ఆయన వ్యాఖ్యలను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. అనగనగ ఒక పేదవాడు.. పదుల సంఖ్యల్లో ప్యాలెస్ లు, వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్సూ, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
నవ్వకండి its a Serious Matter అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్న మీరు 'పేదోడికి పెత్తందార్లకి మధ్య యుద్దం' అంటుంటే నవ్వాగట్లేదు సారూ, అంటూ సెటైర్లు వేశారు. చెప్పే మీకు కామెడీగా లేకపోయినా వినే మాకు వింతగా ఉందండి అంటూ నాగబాబు జగన్ ను టార్గెట్ చేశారు.
బహుశా అది నిజమేనేమో సుమండి 'పెత్తందార్లైన మీకు, పేదోడికి మధ్య నిజంగానే యుద్దం అందుకే మీరు రాష్ట్రమంతా 'సిద్దం' బ్యానర్లతో సిద్దం అయ్యారనిపిస్తుంది అంటూ పేర్కొన్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీల ఆస్తులను, ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలను చెప్పిన నాగబాబు వైసీపీ ఎంపీల ఆస్తులు 4,766 కోట్ల రూపాయలని, వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు 3,379 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.
దేశంలో మూడవ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసిపి వారేనని పేర్కొని, పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో ప్రజలకు అర్థమయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కామెడీగా ఉన్నాయన్నారు నాగబాబు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications